Featured

ఐదేళ్ల కూతురితో చెన్నైకి చేరిన సంపత్ రాజ్..ఇప్పటికి మళ్ళీ పెళ్లి ఎందుకు చేసుకోలేదు.

మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరు ప్రముఖులు వారు ఇండస్ట్రీకి రాకముందే వారికి పెళ్లి అయినా సరే అవి దాచి పెట్టి సినిమాలు చేస్తూ బిజీ జీవితాన్ని గడిపారు. అలాంటి వారు ఎవరో ఒకసారి చూద్దాం.. ఇక మన టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో సిద్ధార్థ్ లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్నారు. అయితే అతని ఇమేజ్ ఎక్కడ పోతుందో అని చెప్పి ఆయనకు పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి చాలా రోజుల వరకు దాచాడు. అయితే ఎట్టకేలకు ఆ విషయం కొన్ని సినీ వర్గాల ద్వారా బయటి ప్రపంచానికి తెలిసింది. కేవలం హీరోలు మాత్రమే కాకుండా ఈ లిస్టులో హీరోయిన్లు కూడా ఎందరో ఉన్నారు. వారు పెళ్లి అయింది అని చెబితే ఎక్కడ సినిమా ఆఫర్లు రావో అని ఆ విషయాన్ని దాచి పెట్టి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుంటారు.

కేవలం హీరో హీరోయిన్లు మాత్రమే కాదు కొందరు కమీడియన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా పెళ్లి కాలేదని సినీ ఇండస్ట్రీలో కొనసాగిన వారు ఎందరో ఉన్నారు. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ 30 ఇయర్స్ ఇండస్ట్రీగా పేరుపొందిన పృథ్వి రాజ్ కూడా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అతనికి పెళ్ళయిందని విషయాన్ని దాచి కొన్ని సినిమాల్లో నటించారు. ఈయనకు సినిమాల్లోకి రాకముందే విజయవాడకు చెందిన ఓ స్వీట్ షాప్ యజమాని కూతురు శ్రీలక్ష్మి తో వివాహం చేసుకున్నాడు. పృథ్వీరాజ్ మామ గారు చనిపోయిన ఆ స్వీట్ షాప్ ను తన భార్యతో కలిసి చూసుకునేవారు. కాకపోతే నటుడిగా బిజీ కావడంతో కుటుంబాన్ని విజయవాడ నుంచి హైదరాబాద్ కు తీసుకువచ్చారు. ఆ తర్వాత సినిమాలలో మునిగిపోయి కుటుంబాన్ని ఆయన పట్టించుకోకపోవడంతో చివరికి ఆయన భార్య తన భర్త పై తనని తన పిల్లల్ని చూసుకోవడం లేదని విజయవాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే ఆ సమయంలో ఆయన సంపాదన బాగా ఉండడంతో ప్రతి నెల పెద్ద మొత్తంలో భరణం ఇవ్వాలని విజయవాడ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. అయితే ఆ కుటుంబం కేసులకు సంబంధించి కొంత విచారణ జరిగిన తర్వాత చివరికి మళ్ళీ ఆయన అతని భార్యతో కలిసి పోయి ప్రస్తుతం హైదరాబాదులో జీవిస్తున్నారు.

తెలుగు, తమిళ సినిమాలలో సపోర్టింగ్ క్యారెక్టర్ గా, విలన్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి సంపత్ రాజ్. ఈయన కూడా సినిమా ఇండస్ట్రీకి రాక ముందే వివాహం జరిగింది. అయితే ఆ విషయాన్ని దాచి పెట్టి ఆయన సినిమా ఇండస్ట్రీ లోకి రంగప్రవేశం చేశారు. ఈయన టాలీవుడ్ లో పంజా సినిమా ద్వారా రంగ ప్రవేశం చేశారు. తెలుగులోకి అడుగుపెట్టక ముందే ఆయన తమిళ ఇండస్ట్రీలో బాగా పేరు పొందాడు. తెలుగులో దమ్ము, మిర్చి, సోగ్గాడే చిన్నినాయన, శ్రీమంతుడు, రారండోయ్ వేడుక చూద్దాం.. లాంటి సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. కేవలం తెలుగు, తమిళ్ సినిమాల్లో మాత్రమే కాకుండా మిగతా బాషల సినిమాల్లో కూడా ఆయన నటించి మెప్పించారు. అయితే ఈ మధ్య కాలంలో ఓ సారి ఆయన తన పెళ్లి విషయానికి సంబంధించి విషయాలను తెలియజేశాడు. ఇదివరకే తనకు వివాహం అయిందని అంతేకాకుండా తనకు పిల్లలు కూడా ఉన్నారని తేల్చి చెప్పాడు. తనకి 23 సంవత్సరాలు ఉన్న సమయంలోనే తన ఇంటి సభ్యులు సమక్షంలో 19 ఏళ్ల యువతిని వివాహం చేసుకున్నట్లు తెలిపాడు.

అయితే ఆ సమయంలో ఆవిడ అంతగా మానసికంగా ఎదగలేదని ఆవిడతో సంసారం చేయలేక, అంతేకాకుండా తనకు నటనపై ఉన్న ఇష్టంతో ఆవిడకు విడాకులు కూడా ఇచ్చానని తెలిపాడు. తను సినిమాల్లో నటించడానికి తన భార్య సహకారం లేకపోవడం కూడా ఎంతో బాధించిందని ఆయన తెలిపారు. తన భార్యకు విడాకులు ఇచ్చిన కానీ ఇప్పటికి కూడా తనతో ఓ మంచి స్నేహితుడుగా ఉంటాను అంటూ ఆ కుటుంబానికి ఏదైనా ఆర్థిక సహాయం అవసరమైనప్పుడు తాను డబ్బులు ఇస్తాను అంటూ అసలు విషయాన్ని తెలిపారు. అంతేకాకుండా ఆ సమయంలో ఆవిడ విడాకులు తీసుకోకుండా తనని నేను చంపేవాడిని అని లేకపోతే ఆవిడే నన్ను చంపేదని కూడా చెప్పి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇక పోతే సంపత్ రాజ్ కి మొదటి భార్యతో ఒక కూతురు కూడా ఉంది. భార్యకు విడాకులు ఇచ్చిన కూడా కూతురిని మాత్రం తన దగ్గరే ఉంచుకున్నాడు. అంతే కాదు తన కూతురు ఆలనా పాలన అన్ని తానే చూసుకుంటున్నాడు. కూతురు రెండవ తరగతి చదువుతున్న సమయంలో చెన్నై కి వెళ్లి అక్కడే స్థిరపడిపోయాడు. ఇప్పటికి మల్లి పెళ్లి చేసుకోకుండా కూతురిని చదివిస్తూ సింగల్ పేరెంట్ గా మిగిలిపోయాడు సంపత్ రాజ్.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago