పోస్టర్ రివ్యూ: ప్రేక్షకుల ముందుకు వచ్చిన పోస్టర్ సినిమా.. ఎలా ఉందంటే?

 

ప్రతివారం ఎన్నో సినిమాలు విడుదల అవుతూ ప్రేక్షకులను సందడి చేస్తుంటాయి. ఈ క్రమంలోనే టీ మహిపాల్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిన చిత్రం పోస్టర్. ఇందులో విజయ్‌ ధరన్‌, రాశిసింగ్‌, అక్షత సోనావానే హీరోహీరోయిన్లుగా నటించారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుందనే విషయానికి వస్తే…

కథ: సిద్దిపేట(తెలంగాణ)కి చెందిన శ్రీను(విజయ్‌ ధరన్‌) జీవితం పట్ల ఏ మాత్రం బాధ్యత లేకుండా ఎంతో ఆవారాగా తిరుగుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఇతని తండ్రి పాత్రలో నటించిన శివాజీరాజా ఒక థియేటర్ లో పనిచేస్తుంటాడు. ఈ క్రమంలోనే థియేటర్ ఓనర్ పెద్దా రెడ్డి కుమార్తె మేఘన (అక్షత) ను ప్రేమిస్తాడు. ఈ విషయం పెద్దారెడ్డి తెలియక అతనిని తన దగ్గరే పనిలో పెట్టుకుంటాడు.చివరికి తన కూతురిని ప్రేమిస్తున్నాడు అన్న విషయం తెలుసుకొని తన మనుషులతో హీరో ఇంటిపై దాడి చేస్తాడు. ఇలా నలుగురిలో తనకు అవమానం జరిగిందని భావించిన హీరో తండ్రి తన ఇంటి నుంచి బయటకు పంపిస్తాడు. అలా బయటకు వెళ్లిన అతను చివరికి తాను ప్రేమించిన అమ్మాయిని ఎలా సొంతం చేసుకున్నారని కథ సాగుతుంది.

విశ్లేషణ: ఇప్పటికే ఈ విధమైనటువంటి కథతో ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఈ సినిమా మొదటి పార్ట్ మొత్తం తండ్రీ కొడుకుల మధ్య ఎంతో సరదా సన్నివేశాలు సాగుతాయి. అలాగే కొడుకు జీవితం గురించి ఒక తండ్రి పడే ఆవేదన ఎలా ఉంటుందో అద్భుతంగా చూపించారు. క్లైమాక్స్ సీన్ ఈ సినిమాకి హైలెట్ అయినప్పటికీ సెకండ్ హాఫ్ చాలా స్లోగా నడుస్తూ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించిందని చెప్పవచ్చు.

నటీనటులు: విజయ్‌ ధరన్‌ ఈ సినిమాని మొదటి సినిమా అనే భావన కలగకుండా ఎంతో అద్భుతంగా నటించారు. ఈ హీరోకి మంచి ఫ్యూచర్ ఉందని చెప్పవచ్చు. ఇక ఇందులో హీరోయిన్ గా నటించిన అక్షత మోడ్రన్ విలేజ్ అమ్మాయిగా తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సెకండ్ హాఫ్ లో తులసి పాత్రలో రాశి సింగ్ పక్కింటి అమ్మాయిగా ఎంతో అద్భుతంగా నటించారు.ఇక హీరో తల్లి తండ్రి పాత్రలో శివాజీరాజా మధుమణి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

టెక్నీషియన్స్: టి. మహిపాల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి శాండీ అద్దంకి పాటలు అద్భుతంగా వచ్చాయి.మార్తాండ కె వెంకటేష్ ఎడిటింగ్,
కెమెరా మ్యాన్ రాహుల్ విజువల్‌ కట్టిపడేసేలా ఉన్నాయి. 
రేటింగ్2.75