Featured

బాలయ్య సినిమా కోసం శృతి హాసన్ ఇన్ని కండిషన్స్ పెట్టిందా..!

నందమూరి నటసింహం బాలకృష్ణ తన 107 వ చిత్రంగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్నట్లు మనకు తెలిసిందే. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను ప్రారంభించి సినిమా షూటింగ్ ను మొదలు పెట్టింది.ఈ క్రమంలోనే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటించడానికి ముందుగా దర్శకుడు శృతిహాసన్ ను సంప్రదిస్తే ఆమె నో చెప్పినట్లు సమాచారం. అయితే గోపీచంద్ తనను కన్విన్స్ చేయడం వల్ల గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్, బలుపు వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న శృతి హాసన్ దర్శకుడు అడగడంతో కాదనలేకపోయింది.

ఈ సినిమా కోసం శృతి హాసన్ ఒప్పుకోవడమే కాకుండా ఎన్నో కండిషన్ లు పెట్టింది. అదేవిధంగా ఏకంగా తను రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో నిర్మాతలు వెంటనే ఆమె అడిగిన రెమ్యునరేషన్ చెల్లించడమే కాకుండా ఆమె పెట్టిన కండిషన్లకు దర్శకుడు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

ఇందులో గ్లామరస్ పాత్రలో డాన్స్ చేయడానికి, నటించడానికి తనకు అభ్యంతరం లేకపోయినా ఎక్కువగా టచింగ్, హగ్గులు వంటివి ఉండకూడదని, రొమాంటిక్ సన్నివేశాల్లో నటించనని ఈమె కండిషన్ పెట్టిందట. అదేవిధంగా ఈ సినిమాలో తన పాత్ర ఎంతో హుందాగా ఉండాలని ఈమె దర్శకుడికి చెప్పినట్లు సమాచారం.ఈమె పెట్టిన షరతులు అన్నింటికీ ఒప్పుకున్న దర్శకుడు ఎలాంటి సమస్య ఉండదని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇకపోతే బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ సినిమా డిసెంబర్ 2వ తేదీ విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేయనున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

2 days ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

2 days ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

2 days ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

2 days ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

2 days ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

3 days ago