Prabhas: ప్లాప్ టాక్ తెచ్చుకొని 9 థియేటర్లలో 100 రోజులు ఆడిన ప్రభాస్ సినిమా?

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు పొందిన నటుడు ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. బాహుబలి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన ఈ సినిమా తరువాత తన తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ఆదరణ సొంతం చేసుకున్నాయి. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ వరుసగా మూడు పాన్ ఇండియా సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇలా ప్రభాస్ నటించిన మూడు పాన్ ఇండియా సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి అయితే ఇటీవల ప్రభాస్ నటించిన సలార్ సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభాస్ గురించి తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ఆయన వ్యక్తిగత విషయానికి సంబంధించినవి కాకుండా వృత్తిపరమైనటువంటి విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

తాజాగా ప్రభాస్ సినిమాలకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది. ప్రభాస్ సినిమాలు ఫ్లాప్ టాప్ సొంతం చేసుకున్న కూడా కలెక్షన్ల పరంగా మాత్రం ఎంతో అద్భుతమైనటువంటి కలెక్షన్లను రాబడతాయి అనే విషయం మనకు తెలిసిందే. ఇలా ప్రభాస్ సినిమాలు నెగిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ భారీ ఓపెనింగ్స్ తో నిర్మాతలు నష్టపోకుండా కలెక్షన్స్ రాబట్టాయనే విషయం తెలిసిందే.

ఇలా సినిమా నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్న కలెక్షన్స్ రాబట్టే సత్తా కేవలం ప్రభాస్ కి మాత్రమే ఉంది అంటూ ఇటీవల సలార్ సినిమా ప్రొడ్యూసర్ విజయ్ కిరంగదూర్ కూడా తెలియజేసిన సంగతి తెలిసిందే. ఇలా ప్రభాస్ నటించిన సినిమాలలో ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుని ఏకంగా తొమ్మిది థియేటర్లలో వంద రోజులు ఆడినటువంటి సినిమా కూడా ఉంది. మరి ఇలా వంద రోజులు ఆడిన ఆ సినిమా ఏంటి అనే విషయానికి వస్తే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఇలియానా ప్రభాస్ నటించిన చిత్రం మున్నా.

అంచనాలు పెంచిన సలార్..

ఈ సినిమాలో పెద్దగా కంటెంట్ లేకపోవడంతో ఈ సినిమా ఫ్లాప్ సొంతం చేసుకుంది. అయితే కొన్ని ప్రాంతాలలో మాత్రం ఈ సినిమా ఏకంగా వంద రోజులు ఆడి సంచలనాలను సృష్టించింది. ఇలాంటి రికార్డు కేవలం ప్రభాస్ కి మాత్రమే సాధ్యమవుతుంది అంటూ ఈ వార్తలపై ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రభాస్ సలార్ సినిమా హిట్ కావడంతో తదుపరి కల్కి స్పిరిట్ సినిమాలపై కూడా అంచనాలు పెరిగిపోయాయి.