AP Elections: ఏపీ ఎన్నికల ప్రచారాలలో ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి.. ఏ పార్టీ కోసమో తెలుసా?

AP Elections: ఏపీ ఎన్నికలకు కేవలం మూడు రోజుల సమయం మాత్రమే ఉంది మే 13వ తేదీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ప్రచార కార్యక్రమాలు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. ఇలా అన్ని పార్టీ నేతలు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్నారు అంతేకాకుండా పలువురు సినీ సెలబ్రిటీలు కూడా కూటమి సభ్యులకు మద్దతుగా నిలబడిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మెగా హీరోలు అందరితో పాటు జబర్దస్త్ సీరియల్ ఆర్టిస్టులు కూడా సపోర్ట్ చేయగా తాజాగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి సైతం ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటూ కూటమికి మద్దతు తెలియజేశారు.

నరసాపురం ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి శ్రీనివాస్ వర్మకు ఆమె మద్దతు తెలియజేస్తూ ఆయన తరపున నర్సాపురంలో ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు ఇందులో భాగంగానే శ్యామలాదేవి నర్సాపురంలో జరిగిన మత్స్యకారుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీనివాస వర్మకు అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

గెలుపు ఎవరిది..
ఇకపోతే 2019వ సంవత్సరంలో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలు చాలా ఆసక్తికరంగా మారాయి. వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగారు. అలాగే మరోవైపు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ ఈ మూడు పార్టీల కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి రాబోతున్న నేపథ్యంలో ఈ ఎన్నికలలో విజయం ఎవరు సాధిస్తారనే విషయంపై అందరిలోనూ ఎంతో ఆసక్తి నెలకొంది.