YS Sharmila: వైయస్ షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న తర్వాత ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా పదవి అందుకున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో ఈమె కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీకి సిద్ధమయ్యారు. ఇక వచ్చే ఎన్నికలలో వైఎస్ షర్మిల కడప నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈమె కడపలో పెద్ద ఎత్తున పర్యటనలు చేస్తూ వచ్చారు..
ఇలా తన ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఈమె తీవ్రస్థాయిలో తన అన్నయ్య ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా షర్మిల జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతూ.. వైసీపీ వాళ్లు హత్యలు చేయడానికి అధికారాన్ని వాడుకుంటున్నారని మండిపడ్డారు.
వివేకానంద రెడ్డి బాబాయ్ హత్య కేసులో భాగంగా సిబిఐ అవినాష్ హంతకుడని తేల్చేసింది. బాబాయిని చంపిన హంతకులను సీఎం కాపాడుతున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చినది ఆయనని కాపాడటానికేనా అంటూ ఈమె ప్రశ్నించారు. ఒకప్పుడు తన అన్న గెలవాలని పాదయాత్ర చేశాను కానీ ఇప్పుడు మాత్రం న్యాయం కోసం నిలబడ్డానని తెలిపారు.
న్యాయం కోసం నిలబడ్డా…
న్యాయం కోసం నిలబడిన నాకు న్యాయం గెలుస్తుందా? నేరం గెలుస్తుందా అనేది ఈ ప్రపంచం చూస్తోంది అంటూ ఈ సందర్భంగా షర్మిల మరోసారి జగన్మోహన్ రెడ్డి పై అలాగే అవినాష్ రెడ్డి పై విమర్శలు చేస్తూ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…