Salaar Ott: సలార్ సినిమా ఓటీటీ రైట్స్ కైవసం చేసుకున్న నెట్ ఫ్లిక్స్… స్ట్రీమింగ్ అప్పుడేనా?

Salaar Ott: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించినటువంటి తాజా చిత్రం సలార్. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ప్రేక్షకులను థియేటర్లలో సందడి చేసింది. ఈ సినిమా ఇప్పటికే మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన ఈ సినిమా అదే స్థాయిలో సక్సెస్ అందుకోబోతుంది అంటూ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను చేరుకుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా థియేటర్లలో మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో కమర్షియల్ గా కూడా ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమా ఓటీటీ రైట్స్ గురించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. ఈ సినిమా అన్ని భాషలలోనూ కలిపి ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఈ సినిమా హక్కులను ఏకంగా 160 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్టు సమాచారం.

నెల రోజుల తర్వాత స్ట్రీమింగ్…

ఇక ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకోవడంతో ఈ సినిమాని నెలరోజుల తర్వాతనే ఓటీటీలో విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. సాధారణంగా యావరేజ్ టాక్ సొంతం చేసుకున్నటువంటి సినిమాలు నెల రోజుల లోపే డిజిటల్ మీడియాలో ప్రసారమవుతుంటాయి. కానీ ఈ సినిమా నెల రోజుల తర్వాత నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుందని తెలుస్తుంది. త్వరలోనే అన్ని విషయాలను నెట్ఫ్లిక్స్ అధికారికంగా విడుదల చేయనుంది.