Categories: FeaturedMovie News

Amar Deep: గొప్ప మనసు చాటుకున్న బిగ్ బాస్ రన్నర్ అమర్ దీప్… వారందరికీ సహాయం!

Amar Deep:బిగ్ బాస్ సీజన్ సెవెన్ రన్నర్ గా గెలుపు సాధించినటువంటి అమర్ పట్ల పల్లవి ప్రశాంత్ అభిమానులు చాలా దారుణంగా ప్రవర్తించారు. ఈయన తన భార్య తల్లితో కలిసి ప్రయాణిస్తున్నటువంటి కారుపై రాళ్ల దాడి చేశారు. అయితే ఈ దాడి పట్ల అమర్ మాట్లాడుతూ నేనొక్కడే ఉన్నప్పుడు ఎలాంటివి చేసిన నేను భరిస్తాను కానీ పక్కనే మన ఫ్యామిలీతో ఉన్నప్పుడు మాత్రం దయచేసి ఎవరూ కూడా ఇలాంటివి చేయకండి ప్రాణాలు పోతే తిరిగి తెచ్చుకోలేము అంటూ స్పందించారు.

ఇక ఈయన బిగ్ బాస్ గెలిచిన తర్వాత తన సొంత పట్టణమైనటువంటి అనంతపురానికి తన తల్లి భార్యతో కలిసి వెళ్లారు. అక్కడ అభిమానులను కలిసినటువంటి ఈయన సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారు. దుప్పట్లు దుస్తులు వారి అవసరాలకు సంబంధించినటువంటి అన్ని వస్తువులను అందజేశారు. అదేవిధంగా ఆ చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో అమర్ తో పాటు ఆయన భార్య తేజస్విని అలాగే తల్లి కూడా ఉన్నారు. ఇలా పిల్లలతో కలిసి తమ ఆనందాన్ని వీరు పంచుకున్నారు అదేవిధంగా వారందరికీ అమర్ కుటుంబం స్వయంగా భోజనాలు పెట్టి వారి కడుపు నింపారు. ఇక అనంతరం అమర్ మాట్లాడుతూ నాకు దేవుడు ఇచ్చిన శక్తి మేరకు నేను అందరికీ సహాయం చేస్తానని మీరందరి తోడు సహాయం నాకు కావాలి అంటూ ఈయన తెలిపారు.

మంచి మనసు చాటుకున్న అమర్..

ఇలా అమర్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఎలాంటి మాస్క్ లేకుండా చాలా జెన్యూన్ గా గేమ్ ఆడారు. ఆయనకు తోచినదే చెప్పారు. ఇలా అమర్ మాట తీరు వ్యవహార శైలి కారణంగా చాలామంది ఈయనపై ట్రోల్స్ కూడా చేశారు కానీ ఆయన చాలా జెన్యూన్ గా ఆడారు అనే విషయం తెలియడంతో ఈయనని అభిమానించే వారి సంఖ్య కూడా పెరిగిపోయింది. దీంతో టైటిల్ రేస్ వరకు అమర్ చేరుకున్నారు. చివరికి రన్నర్ గా మాత్రమే మిగిలారు..

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

2 weeks ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago