Telugu Film Producers Council: ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.. ఏం జరిగిందంటే?

Telugu Film Producers Council: ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.. ఏం జరిగిందంటే?

Politics-TollyWood:ఏపీ ప్రభుత్వానికి, టాలీవుడ్ లకు మధ్య టికెట్ల రేట్ల విషయంలో వివాదం తగ్గడం లేదు. రోజుకో వివాదస్పద వ్యాఖ్యలతో రచ్చ చెలరేగుతూనే ఉంది. గతంలో హీరో నాని చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. థియేటర్ల కలెక్షన్ల కన్నా .. కిరాణా కొట్టు కలెక్షన్లే బాగున్నాయంటూ నేరుగా ప్రభుత్వంపైనే వ్యాఖ్యలు చేశాడు.

Telugu Film Producers Council: ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.. ఏం జరిగిందంటే?
Telugu Film Producers Council: ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.. ఏం జరిగిందంటే?

మరో హీరో సిద్ధార్థ్ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేఖించాడు. దీంతో ఏపీ మంత్రి పేర్నినాని వీరిద్దరికి తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు.  ఇదిలా ఉంటే ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ.. ఏపీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా పలు ప్రశ్నలు సంధిస్తున్నారు.

Telugu Film Producers Council: ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.. ఏం జరిగిందంటే?

తాజాగా నిన్న ఆర్జీవీ, మంత్రి పేర్నినానితో భేటీ అయ్యారు. వీరిద్దరు టికెట్ రేట్లపై చర్చించారు. టికెట్ రేట్లను తగ్గించడం వల్ల సినిమా క్వాలిటీ దెబ్బతింటుందని.. మంత్రికి ఆర్జీవి వివరించారు.  నిన్న వైసీపీ ఎమ్మెల్యే నన్నపురెడ్డి ప్రసన్న కుమార్ చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ ఇండస్ట్రీ భగ్గుమంటోంది. సినిమా హీరోలు కోట్లు కోట్లు తీసుకుంటున్నారని.. చంద్రబాబు చేతిలో ఉన్నారంటూ వ్యాఖ్యలు చేశారు.

చివరకు ఆస్తులు అమ్ముకోవడం జరుగుతుందని.

సినిమా వాళ్లు బలికోట్టుకుంటున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో టాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై నిర్మాతల మండలి స్పందించింది. కొవ్వూర్ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మొత్తం తెలుగు సినిమా పరిశ్రమను అవమానించినట్టుగా భావిస్తున్నామని అన్నారు. మన తెలుగు సినిమా సక్సెస్ రేటు సుమారుగా 2 నుండి 5% మాత్రమే మిగిలిన సినిమాలు నష్టపోవడం జరుగుతుంది. చిత్రసీమలో ఉన్న 24 కాప్స్ కు పని కల్పిస్తూ, అనేక ఇబ్బందులు పడి, కోట్ల రూపాయలు ఖర్చు చేసి సినిమాలు తీసిన నిర్మాతలు, చివరకు ఆస్తులు అమ్ముకోవడం జరుగుతుందని..ఈ నష్టాల బారిన పడ్డ నిర్మాతలు నిర్మాత మండలి నుంచి రూ. 3 వేలు పెంఛన్లు తీసుకుంటున్నారని..గౌరవ సభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు నిర్మాతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తీవ్రంగా ఖండిస్తుందని తెలియజేస్తూ వారి వ్యాఖలను ఉపసంహరించుకోవాలని కోరుచున్నాము” అంటూ లేఖలో పేర్కొన్నారు.