Sruti Haasan: స్టార్ హీరోయిన్ శృతిహాసన్ మళ్లీ సినిమాలతో బిజీ అవుతోంది. ఇప్పటికే పలు క్రేజీ ప్రాజెక్ట్ లకు ఓకే చెప్పింది. కమల్ హాసన్ కూతురుగా కెరీర్ మొదలు పెట్టిన శృతిహాసన్.. స్టార్ కిడ్ హోదా నుంచి తన సొంత టాలెంట్ తో ఫిలిం ఇండస్ట్రీలో నిలదొక్కకుంది.
టాలీవుడ్, కోలీవుడ్ లతో పలువురు అగ్ర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇదిలా ఉంటే.. కొన్నాళ్ల క్రితం తన బాయ్ ఫ్రెండ్ ఇంగ్లాండ్ సింగర్ మైకెల్ కోర్సరేతో బ్రేకప్ చెప్పింది. మైకల్ తో ప్రేమలో మునిగిన శృతిహాసన్.. హఠాత్తుగా ఈ జంట విడిపోయింది.
దీంతో కొన్నాళ్ల వరకు సినిమాలకు దూరంగా ఉంది. ఈ ఏడాది నుంచి వరస పెట్టి సినిమాలను చేస్తోంది. తెలుగులో రవితేజ పక్కన క్రాక్ సినిమాలో నటించింది. ఆ తరువాత పవన్ కళ్యాణ్ తో కలిసి ‘వకీల్ సాబ్’ అనే సినిమాలో కనిపించింది.
ఈ రెండు సినిమాలు భారీ విజయాన్ని దక్కించుకున్నాయి. ఈ సినిమా తరువాత ఆమె బిజీ స్టార్ అయిపోయింది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కలిసి ‘సలార్’ సినిమాలో నటిస్తోంది. అలానే బాలయ్య 107 వ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది ఈభామ. తాజా మరో వ్యక్తితో శృతిహాసన్ రిలేషన్ షిప్ లో ఉంది. ప్రముఖ డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో ప్రేమలో ఉంది శృతిహాసన్. అయితే మొదట్లో శాంతను నాకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పినప్పటికీ.. ప్రస్తుతం మాత్రం తానే ముందుగా శాంతనుకు ప్రపోజ్ చేశాననే విషయాన్ని వెల్లడించింది. తాజాగా ఇన్ స్టా గ్రామ్ కపుల్ ఛాలెంజ్ లో పాల్గొన్న వీరు తమ మధ్య ప్రేమను రివీల్ చేశారు. ఇద్దరిలో ఎవరు బాగా ప్రొటెక్టివ్‌గా ఉంటారని అడగగా.. ఒకరినొకరు చూపించుకున్నారు. శాంతను బాగా తింటాడని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…