Balakrishna: నందమూరి బాలకృష్ణ వెండితెరపైనే కాకుండా స్మాల్ స్క్రీన్‌లోనూ తన సత్తా చాటుతున్నాడు. ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’ షో ఆహా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో దూసుకుపోతోంది. ఇప్పటికే ఎంతో మంది దర్శకులు, నిర్మాతలు, హీరోలు ఈ షోకు వచ్చిన విషయం తెలిసిందే.
షోలకు, సినిమాలకు రేటింగ్ ఇచ్చే.. ఐఎండీబీ వెబ్ సైట్ లో ఈ షో టాప్ 10 లో స్థానం సంపాదించడం విశేషం. మొదటి షోలో మోహన్ బాబు, మంచు లక్ష్మి సందడి చేశారు. తర్వాత నానీ, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి, పుష్ప టీం, అఖండ టీం, రవితేజ, గోపీచంద్ మలినేని, రానా వచ్చి అలరించారు.
తాజాగా మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఛార్మి, విజయ్ దేవరకొండలతో కూడిన లైగర్ మూవీ యూనిట్ నందమూరి బాలయ్యతో అన్‌స్టాపబుల్ షోకి గెస్ట్‌లుగా వచ్చారు. ఈ స్పెషల్ ఎపిసోడ్ మొత్తాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న స్ట్రీమింగ్ కానుంది.
ఈ షోకి సంబంధించిన స్పెషల్ ప్రోమోను షో మేకర్స్ రివీల్ చేశారు. వీడియోలో, లైగర్ చిత్ర యూనిట్ తమ సినిమా అనుభవాలను పంచుకోవడం అందులో కనిపించింది. షో ప్రోమోలో విజయ్ దేవరకొండ తన బాక్సింగ్ నైపుణ్యాలను కూడా ప్రదర్శించాడు. అర్జున్ రెడ్డికి వెల్ కమ్ చెబుతున్న సమరసింహారెడ్డి అంటూ బాలయ్య అలరించాడు. షోకి రావడమే.. బాక్సింగ్ చేస్తూ బాలయ్య, విజయ్ దేవరకొండ కాసేపు ప్రేక్షకులను నవ్వులతో పూయించాడు. నటుడిగానే కాకుండా ఇలా టక్ షోలో అతడు హోస్ట్ గా మారిన బాలకృష్ణతో అతని కార్యకలాపాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక లైగర్ సినిమా విషయానికి వస్తే.. ఇది పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…