నాన్ వెజ్ లోనే కాదు.. శాఖాహారాల్లో కూడా ప్రోటీన్లు ఉన్నాయి.. అవేంటంటే..!

మానవ శరీరానికి ప్రోటీన్లు అనేవి చాలా ఉపయోగపడతాయి. కానీ ఈ ప్రోటీన్ల కోసం చాలా మంది నాన్ వెజ్ తీసుకుంటూ ఉంటారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ప్రోటీన్లు అనేవి శాఖాహార పదర్థాలల్లో కూడా ఉంటాయి. ఇక నుంచి ప్రోటీన్లు కావాలంటే గుడ్లు, మాంసం వైపు మీ చూపు తిప్పుకోకుండా శాఖాహారంలో కూడా ఉండే ప్రోటన్ల గురించి కూడా తెలుసుకోండి.

వీటిని ప్రోటీన్లకు ఉత్తమ వనరుగా పరిగణిస్తారు. అటువంటి 6 ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. అంతే కాకుండా అందులో ఎంత వరకు ప్రోటీన్లు లభిస్తాయనే దాని గురించి కూడా తెలుసుకుందాం. మనం తినే ఆహారంలో బలమైనది ఏదైనా ఉందంటే అది వేరుశనగ. అర కప్పు వేరుశెనగలో 20 గ్రాముల కంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటాయి. వేరుశనగను నానబెట్టి తింటే ఎక్కువ ప్రోటీన్లు మన శరీరంలో కి వెళ్తాయి. పప్పుల్లో, చిక్కుడుజాతి గింజల్లో పీచు, ప్రోటీన్లు దండిగా ఉంటాయి. అందువల్ల ఇవి త్వరగా కడుపునిండిన భావన కలిగిస్తాయి.

దీనిలో ఒక గిన్నె పప్పులో 18 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. సోయా పాలతో తయారు చేసిన పనీర్‌ను టోఫు అంటారు. 90 గ్రాముల టోఫులో సుమారు 9-10 గ్రాముల ప్రోటీన్ కనిపిస్తుంది. మీరు టోఫు తినలేకపోతే.. దీనికి బదులుగా సోయాబీన్స్ తినవచ్చు. శనగపప్పును ప్రోటీన్ల మూలంగా పరిగణించబడతాయి. అర కప్పు శనగ పప్పు నుంచి సుమారు 8 గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి.

రాజ్‌గిరా కూడా ప్రోటీన్‌కు మంచి మూలం. మీరు చేసుకునే చపాతీ పిండిలో రాజ్ గిరా పిండిని కలపండి. ఒక కప్పు రాజ్‌గిరాలో దాదాపు 10 గ్రాముల ప్రోటీన్ కనిపిస్తుంది. బాదం అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. దీనిలో కూడా అనేక రకాల ప్రోటీన్లు ఉంటాయి. ఇది కూడా చిక్కుడు జాతికి చెందిన మొక్కే. అర కప్పు బాదంలో దాదాపు 17 గ్రాముల ప్రోటీన్ లు ఉంటాయి. చిక్కుడు జాతి గింజల్లో ప్రోటీన్లు అనేవి అధికంగా ఉంటాయి.