మళ్ళీ వర్షాలు.. ఏ..ఏ జిల్లాలో అంటే!

10 రోజులుగా ముఖం చాటేసిన వర్షాలు మళ్ళీ మెుదలు కానున్నాయి. తెలంగాణలో పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ దిశగా రాష్ట్రం వైపు గాలులు వీస్తు‌న్నా‌యని, వీటి వల్ల రాబోయే రెండు రోజుల్లో తేలి‌క‌పాటి వర్షాలు కురు‌స్తా‌యని వాతావరణ కేంద్రం అధికారి వివరించారు.

రాష్ట్రంలో వర్షాలు కురిసే ప్రాంతాలను కూడా గుర్తించింది. ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, వికారాబాద్‌, నారాయణపేట, నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌తో సహా పలు జిల్లాలలో వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. అలాగే నైరుతి రుతుపవనాల కారణంగా మూడు రోజుల పాటు దక్షిణా భారతంలో వర్షాలు కురిసే అవకాశముందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా తమిళనాడులో మెస్తారు వర్షాలు అవకాశ ముందని తెలియజేసింది.