జక్కన్నకు ఆ సినిమాతో గట్టి షాక్.. అందుకే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రిలీజ్ ఆలస్యం..

రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన ‘బాహుబలి’ ఎన్ని రికార్డులను కొల్లగొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్‌తో తెరకెక్కించిన ‘బాహుబలి’ సిరీస్‌కు తెలుగులో కంటే హిందీలో మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇది రెండో పార్ట్ కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెరో రూ.100 కోట్ల చొప్పును రూ.200 కోట్లను షేర్ సాధించింది. ఇక తమిళం,కన్నడ, మలయాళంలో దాదాపు రూ. 150 కోట్ల వరకు కలక్షన్స్ వచ్చాయి. ఇక హిందీ వెర్షన్ మొత్తం కలిపి రూ. 1400 కోట్ల వరకు వసూళ్లను సాధించింది. బాహుబలి పాన్ ఇండియా లెవల్లో విజయవంతం కావడంలో హిందీ ప్రేక్షకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి.

పైగా గ్రాఫిక్స్ వర్క్ బాగా ఉండటంతో ఈ సినిమాను థియేటర్స్‌లో చూడటానికి ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడ్డారు. ఈ సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ కూడా ఇందులో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ప్రస్తుతం ఉక్రెయిన్ లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలను ఆక్టోబర్ 13 న విడుదల చేద్దామని అనుకున్నా.. హీరో అక్షయ్ కుమార్ నీళ్లు చల్లాడనే చెప్పాలి.

ఎందుకంటే.. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘బెల్ బాటమ్’ సినిమాకు మంచి రివ్యూస్‌ వచ్చాయి. కానీ కలెక్షన్లలో మాత్రం ఎక్కువగా వసూలు కాలేదు. అక్షయ్ నటించిన సినిమాల్లో కంటే ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన కలెక్షన్లలో పదో వంతు మాత్రమే వచ్చాయి. దీనిని బట్టి చూస్తే హిందీ ప్రేక్షకుల్లో కరోనా భయం పోలేదని.. అందుకే థియేటర్లకు రాలేదని తెలుస్తోంది. ఆ సినిమాకు హిందీ ప్రేక్షకులు ఆదరించలేదంటే..ఆక్టోబర్ 13 న విడుదలయ్యే ఆర్ఆర్ఆర్ సినిమాకు కూడా ఇలాంటి ఎఫెక్ట్ వస్తుందేమోనని.. రాజమౌళి భయపడుతున్నట్లు తెలుస్తోంది.

అందుకే బాలీవుడ్ మార్కెట్ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను విడుదలను పోస్ట్ పోన్ చేయాలనే ఆలోచనకు రాజమౌళి వచ్చినట్టు సమాచారం. మధ్యలో ఏదైనా హిందీ సినిమాకు మంచి కలెక్షన్లు వస్తే.. పరిస్థితులు చూసుకొని ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్టు సమాచారం. ఏదేమైన ఈ సినిమా విడుదల కోసం ఎదరుచూస్తున్న ప్రేక్షకులకు నిరాశే ఎదురైందని చెప్పాలి.