Movie News

ఎవరు మీలో కోటీశ్వరులులో సందడి చేసిన హీరోలు.. ఆసక్తికర విషయాలను చెప్పిన రామ్ చరణ్..

కౌన్ బనేగా కరోడ్ పతి తెలుగు వెర్షన్ లో ఆదివారం నుంచి ప్రారంభం అయింది. జెమినీ టీవీలో ఎవరు మీలో కోటీశ్వరులు షో ఎంతో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ ఎపిసోడ్ లో రామ్ చరణ్ గెస్ట్ గా వచ్చి హాట్ సీటులో కూర్చున్నారు. ఆర్ఆర్ ఆర్ హీరోలు ఇద్దరూ రావడంతో ఫస్ట్ ఎపిసోడ్‌పై అంచనాలు పెరిగిపోయాయి. దీనిని త్రివిక్రమ్, కళ్యాణ్ కృష్ణ కురసాల లాంటి దర్శకులు తెరకెక్కించారు. వీటికి సంబంధించి ఎట్రీలను ఈ సంవత్సరం మార్చిలోనే తీసుకున్నారు.

కానీ కరోనా కారణంగా వాయిదా వేస్తూ వచ్చారు. ఈ సీజన్ కోసం దాదాపు 13 కోట్లు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిలో నాలెడ్జ్ మాత్రమే కాకుండా ఎంటర్‌టైన్మెంట్ కూడా ఉండటంతో కచ్చితంగా ఈ షో మంచి సక్సెస్ అవుతుందని నమ్ముతున్నారు నిర్వాహకులు. దీని కోసం భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ షోను కూడా భారీ స్థాయిలో లాంఛ్ చేశారు. దీనిలోనే ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నలకు రామ్ చరణ్ ఆసక్తిగా సమాధానాలు చెప్పారు.

దీనిలో ఎన్టీఆర్ వ్యక్తిగత విషయాలను కూడా అడిగారు. ఈ సందర్భంగా అతడు తన దగ్గర ఆరు కుక్కలు ఉన్నాయని.. మరో వైపు గుర్రాలను పెంచుకోవడం అంటే ఎంతో సరదా అన్నారు రామ్ చరణ్. మగధీర సినిమాలో ఓ గుర్రాన్ని రామ్ చరణ్ బాద్ షా అంటూ పిలవడం మనం చూశాం. అతడు పెంచుకుంటున్న గుర్రాల్లో అది కూడా ఒకటి ఉందని చెప్పారు. మరోవైపు ఓ స్నేహితుడు అతను చనిపోయే ముందు తనకు మరో గుర్రాన్ని ఇచ్చాడు. దానికి కాజల్ అని పేరు పెట్టినట్టు చెప్పుకొచ్చారు.

మగధీర రిలీజయ్యాక అది నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించిందంటూ నవ్వులు పూయించారు రామ్ చరణ్. రామ్ చరణ్ బోర్ గా ఫీలయినప్పుడల్లా అదుర్స్ సినిమా చూస్తూ ఉంటారని.. అందులో ఎన్టీఆర్ కామెడీ అదుర్స్ అంటూ మెచ్చుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి మాట్లాడుతూ.. అల్లూరి సీతారామరాజుగా నువ్వు.. కొమరం భీమ్‌గా నేను ఎంత కష్టపడ్డామో తెలుసుగా.. అలాంటి గొప్ప యోధుల పాత్రల్లో నటించడం మా జన్మ ధన్యమైంది అంటూ తారక్ ఎమోషనల్ అయ్యారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago