కొంతమందికి సినీ ఇండస్ట్రీలో అవకాశాలు లేక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటుంటే.. మరో వైపు కొందరికీ అవకాశాల మీద అవకాశాలు వస్తాయి. ఇలా వచ్చిన వాళ్లకు డేట్స్ కుదరక రిజెక్ట్ కూడా చెప్పే వాళ్లు ఉన్నారు. ముఖ్యంగా మనం చెప్పుకునే విషయం ఏంటంటే.. అలనాటి నటి సుకన్య గురించి అప్పట్లో ఆమె నటనకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఆమె నటి మాత్రమే కాదు..గాయని, నాట్యకారిణి కూడా. నిన్నటి వరకు కథానాయికగా వెలిగిన ఈమె ఇప్పుడు కీలకమైన పాత్రలను చేస్తున్నారు.
సీనియర్ హీరోయిన్లు ఉండటంతో సినిమాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని దర్శక నిర్మాతలు ఆలోచిస్తుంటంతో ఇలాంటి వారికి అవకాశాలు వస్తున్నాయనే చెప్పాలి. ఇలా వచ్చే వారిలో ఆమని, మీనా, సుహాసిని, నదియా లాంటి వారు ఉన్నారు. వీళ్లు యంగ్ హీరో, హరోయిన్లకు తల్లిగానో, అత్తగానో చేస్తూ తెరపై సందడి చేస్తున్నారు. ఇలా తల్లి పాత్ర చేసేవారి జాబితాలో పెద్దరికం సుకన్య కూడా కనిపిస్తుంది.
పెద్దరికం సినిమాతోనే సుకన్య తెరకి పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాలో మాత్రమే చేశారు. తమిళం, మళయాళ సినిమాల్లో బిజీ అయిపోవడంతో తెలుగు సినిమాలకు డేట్లు కేటాయించలేకపోయింది సుకన్య. అయినా శ్రీమంతుడు సినిమాలో హహేశ్ బాబు తల్లి పాత్రలో ఆమె మెరిసింది. దాంతో ఇక్కడ వరుసగా సినిమా ఆఫర్లు వస్తాయని అనుకున్నారు.. కానీ ఆమె ఒక్క సినిమా కూడా చేయలేదు.
అలా అని ఆమె తమిళం, మళయాళ సినిమాల్లో బిజీగా ఉన్నారా.. అంటే అదీ లేదు. ఆమెతో పాటు ఆ తరం హీరోయిన్లకు ఆఫర్లు వస్తుంటే సుకన్యకు మాత్రం రావడం లేదు. ఆఫర్లు రాక ఆమె దూరంగా ఉంటున్నారా.. లేదా ఉద్దేశ్య పూర్వకంగానే ఆమె సినిమాలను వదులుకుంటున్నారా.. అనే విషయం మాత్రం అర్థం కావడం లేదు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…