శోభన్‌బాబు హీరోగా నటించిన ‘జగమొండి’ సినిమాలో సురేష్ మొదటి సారిగా నటించారు. ఇందులో అతడు సెకండ్ హీరోగా నటించారు. ఈ చిత్రం సమతా ఆర్ట్స్ రూపొందించారు. ఇక్కడ సురేష్ కు జోడీగా ‘శంకరాభరణం’ రాజ్యలక్ష్మి నటించారు. ఓ పాటను వీళ్లద్దరి మద్య ఊటీలో చిత్రీకరించారు. ఆ పాటలోనే సురేష్ మొదటిసారి కెమెరా ముందు నిల్చున్నారు. అంతకముందు అతడికి నటనలో గానీ, నాట్యంలో గానీ ఎలాంటి అనుభవం కూడా లేదు.
అప్పటికే రాజ్యలక్ష్మి శంకరాభరణం చిత్రం ద్వారా ఎంతో పాపులర్ అయ్యారు. తనకంటే సీనియర్ నటితో కలిసి పాటపాడుతూ, డాన్స్ చెయ్యడం అనగానే మొదట్లో సురేష్ కు కొంచెం జంకు కలిగింది. వీరిద్దరి మధ్య జరిగే మొదటి దృశ్యంలో సురేష్పరుగెత్తుకుంటూ వచ్చి రాజ్యలక్ష్మిని కౌగిలించుకోవాలి. అయితే దర్శకుడు మధుసూదనరావు చిత్రీకరణ కంటే ముందే రిహాసల్స్ చేయించారు.
రాజ్యలక్ష్మిని అతడు రిహాసల్స్ సమయంలో కూడా కౌగిలించుకోకుండానే మూవ్‌మెంట్స్ చూసుకొని మధుసూదనరావు ‘టేక్’ అన్నారు. తర్వాత సౌండ్ స్టార్ట్ అయింది. పాట మొదలైంది.. పురుగెత్తుకుంటూ వెళ్లి అతడు రాజ్యలక్ష్మిని కౌగిలించుకోవాలి. పెదాలు కదుపుతూ పరుగెత్తుకుంటూ వెళ్లి రాజ్యలక్ష్మిని కౌగిలించుకోబోయే ముందు ఆగిపోయాడు సురేష్.
ఏమైంది.. కౌగిలించుకోకుండా ఆగిపోయావు ఏంటి.. అంటూ డైరెక్టర్ ప్రశ్నించారు. కెమెరామేన్, డైరెక్టర్, ఇతర యూనిట్ మెంబర్స్ ముందు ఒక అమ్మాయిని కౌగిలించుకోవడం అనేసరికి సురేష్ కు ఏదోలా అనిపించింది. సరే మళ్లీ మరో టేక్ అన్నట్లు చెప్పాడు.. ఇబ్బంది పడుకుంటూనే.. ఇలా ఒకటి.. రెండు.. మూడు.. నాలుగు.. అయిదు.. ఆరు.. ఏడు.. ఇలా టేకులు తీశారు. డైరెక్టర్ అతడిని దగ్గరకు తీసుకొని ధైర్యం చెప్పి ఎనిమిదో టేక్ లో ఓకె చేశారని ఓ సందర్భంలో సురేష్ తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…