బుల్లితెరలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం బాగా ఆసక్తిగా మారింది. దీపను ఈసారి ఎలాగైనా చంపాలని మోనిత ప్లాన్ చేయడంతో.. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రేక్షకులు కూడా తెగ టెన్షన్ పడుతున్నారు.
దీప నిద్ర లో నుంచి లేచి గుడిలో పూజ గురించి తన తండ్రి కూడా నమ్మకంగా చెప్పాడని గుడికి వెళ్దామని అనుకుంటుంది. వెంటనే వారణాసి కి ఫోన్ చేసి సిద్ధంగా ఉండమని చెబుతుంది.
మరోవైపు మోనిత రెడీ అవుతూ.. దీపను ఎలా చంపితే బాగుంటదని అని అనుకుంటుంది. తన చేతికి మట్టి అంటకుండా, అనుమానం రాకుండా ఉండాలని అనుకుంటుంది. గన్ చూసుకొని ఇది ఉన్నాక ఇంకెందుకు ప్లాన్ చేస్తున్న అని అనుకుంటుంది.
ఇక దీప.. కారులో బయలుదేరుతుండగా.. వారణాసి ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడుగుతాడు. దీప పూజ గురించి చెప్పడంతో.. ఒకరితో ఏం పూజ అని అడుగుతాడు. దీప కూడా డాక్టర్ బాబు కోసం చేస్తున్నానని అంటుంది.
మోనిత కూడా కారులో బయలుదేరుతూ కార్తీక్ గురించి తలుచుకుంటుంది. ఈరోజు దీప ని ఎలాగైనా చంపాలి అని ప్లాన్ చేసుకుంటుంది.
అంజి, దుర్గా మార్నింగ్ జాగింగ్ లో బిజీగా ఉంటారు. ఎలాగైనా వారిద్దరూ దీపమ్మను కాపాడాలని అనుకుంటారు. అంజి.. దీపను ఎలాగైనా చంపాలని అనగా.. దుర్గా వద్దు అంటాడు.
మోనిత అంటే తనకు లవ్ అని సిగ్గు పడతాడు. వెంటనే అంజి షాక్ అవుతూ.. ఈ ప్రపంచంలో దాన్ని కూడా లవ్ చేసేవాడు ఉంటాడా అని అంటాడు. ఇక అక్కడ సీన్ మాత్రం బాగా ఫన్నీ గా సాగుతుంది.
వాళ్లు మోనిత గురించి మాట్లాడుకుంటున్న సమయంలో దీప కారు ఆగుతుంది. ఇక దీపను ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడిగేసరికి పూజ గురించి అసలు విషయం చెబుతుంది. ఇక మేము కూడా వస్తాము అనేసరికి దీప వద్దని చెబుతుంది.
ఇక ఇంట్లో సౌర్య.. సౌందర్య దగ్గరికి వచ్చి అమ్మ ఏదని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తోంది. అంతేకాకుండా కోపంతో నానమ్మ పై అరుస్తోంది. రోషిణి పై మండిపడుతుంది. ఇక సౌందర్య కూడా దీప ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచిస్తుంది.
మోనిత.. కార్తీక్ గురించి ఆలోచిస్తూ.. దీపని చంపేస్తానను అనుకుంటుంది. దీపా అడ్డు తొలగిపోతే పిల్లలతో సంతోషంగా ఉందాము అని కార్తీక్ ని తలుచుకుంటూ మాట్లాడుకుంటుంది.
ఓ వైపు గుడిలో పూజారులు పూజా కార్యక్రమం గురించి ఏర్పాట్లు చేస్తుంటారు. అక్కడికి దీప చేరుకుంటుంది.మోనిత కూడా చేరుకోగా దీపను ఫాలో అవుతూనే ఉంటుంది. కారుని చూస్తూ నేను నా కార్తీక్ తిరిగిన కారు అని అనుకుంటుంది.
దీపా ఎక్కడికి వెళ్తే అక్కడికి తన వెనకాలే తిరుగుతూ ఉంటుంది. ఇక పూజారి దీపతో మాట్లాడుతుంటాడు. పూజ గురించి వివరిస్తాడు. మోనిత మాత్రం పక్కనే ఉండి అవన్నీ వింటుంది. ఇక దీప కూడా పూజకు సిద్ధం గా ఉంటుంది.
మోనిత తన వెంట తెచ్చుకున్న గన్ ను తీసి దీప వైపు గురి పెడుతుంది. దీప కార్తీక్ గురించి పూజారి తో మాట్లాడుతుంటుంది. ఇటువంటి పూజలు కార్తీక్ ను, నన్ను విడదీయవు అని అనుకుంటుంది.
ఇక సోదమ్మ తన తల్లిదండ్రులకు చెప్పిన విషయాన్ని చెబుతుంది దీప. దీప పూజకి సిద్ధమవ్వగా మోనిత తన గన్ తో షూట్ చేయడానికి ప్రయత్నిస్తుంటుంది. ఇక చివరకు మోనిత.. దీప ని షూట్ చేయగా దీపా కింద పడిపోతుంది. ఇక ఆ తర్వాత దీప ప్రాణాలు ఎలా ఉంటాయో అర్థం కాని పరిస్థితిగా మారింది.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…