Categories: FeaturedMovie News

రంగస్థలం సినిమాలో పృద్విరాజ్ సీన్లు తీసేయడానికి కారణం ఏంటో తెలుసా?

సుకుమార్ దర్శకత్వంలో సమంత రామ్ చరణ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం “రంగస్థలం”. అప్పటివరకు క్లాస్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు సుకుమార్ “రంగస్థలం” సినిమా ద్వారా తనలో ఉన్న మాస్ యాంగిల్ ని బయట పెట్టాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ చెవిటివాడి పాత్రలో,అచ్చం పల్లెటూరి యువకుడిలా ఎంతో అద్భుతంగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఈ సినిమా తర్వాత నటుడు రామ్ చరణ్ కూడా వరుస అవకాశాలు అందిపుచ్చుకున్నారు. ఇకపోతే ఈ సినిమా లోజగపతిబాబు విలక్షణ నటుడి పాత్రలో అద్భుతంగా చేశారు. అదేవిధంగా ఆది పినిశెట్టి రంగమ్మత్త పాత్రలో అనసూయ పాత్ర ఈ సినిమాకు హైలెట్ అయ్యాయని చెప్పవచ్చు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి రాజ్ కూడా కీలక పాత్రల్లో నటించారు.

పృధ్విరాజ్ దాదాపు ఒక వారం రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొని తన పాత్రను పూర్తిచేశారు. అదేవిధంగా తన పాత్రకు డబ్బింగ్ కూడా చెప్పినప్పటికీ, కొన్ని కారణాల వల్ల పృథ్వీరాజ్ పాత్రను ఎడిటింగ్ లో తీసేసారనీ తాజాగా పృథ్వి రాజ్ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. అసలు ఈ సినిమా షూటింగ్ మొత్తం చెప్పి డబ్బింగ్ చెప్పిన తర్వాత ఆ సన్నివేశాలు తొలగించడానికి కారణం ఏంటి అనే విషయాలను కూడా ఓ ఇంటర్వ్యూలో పృధ్విరాజ్ వెల్లడించారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. రంగస్థలం సినిమాలో నాపై సన్నివేశాలు అన్నింటినీ తెరకెక్కించారు, నా పాత్రకు డబ్బింగ్ కూడా చెప్పాను. కానీ అమెరికా నుంచి సుకుమార్ స్నేహితుడు ఈయనను ఎందుకు పెట్టుకున్నారు, ఈయన సినిమాలలో ఉంటే రావు గోపాల్ రావుల అవుతారని చెప్పారట అందుకోసమే నేను నటించిన సన్నివేశాలు అన్నింటిని తీసేశారని ఈ సందర్భంగా పృథ్వీరాజ్ తెలియజేశారు.ఇక ప్రస్తుతం పృథ్వి రాజ్ తెలుగు తమిళ సినిమాలలో పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago