Rajamouli: రాజమౌళి నా తండ్రి కాకపోయినా నాకు ఆ భావన కలిగింది… కార్తీకేయ కామెంట్స్ వైరల్!

Rajamouli: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ దర్శకుడిగా గుర్తింపు పొందిన దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు రాజమౌళి దర్శనం ఒక్క సినిమా కూడా ప్లాప్ అవ్వలేదు అంటే ఆయన దర్శకత్వ ప్రతిభ ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. ఒక్కొక్క సినిమాతో అంచలంచెలుగా ఎదుగుతూ తన ఫాలోయింగ్ పెంచుకున్న రాజమౌళి ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసి తెలుగు సినిమా కి ఆస్కార్ అవార్డు వచ్చేలా చేసిన ఘనత రాజమౌళికి దక్కుతుంది.

ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమా కి ఆస్కార్ అవర్ ఆస్కార్ అవార్డు రావడానికి రాజమౌళి తనయుడు కార్తికేయ కూడా కీలక పాత్ర పోషించాడు. రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలకు కుటుంబ సభ్యుల చొరవ ఎక్కువగా ఉంటుంది. రాజమౌళి తో పాటు ఆయన భార్య రమ, కొడుకు కార్తికేయ అలాగే కీరవాణి ఆయన సతీమణి వల్లి ఇలా అందరూ సినిమా కోసం కష్టపడతారు.

ఇక రాజమౌళి సినిమాల మార్కెటింగ్ వ్యవహారాలలో కార్తికేయ కీలక పాత్ర పోషిస్తాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తికేయ ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ అవార్డు రావడం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ క్రమంలో సినిమాకి ఆస్కార్ అవార్డు దకడం కోసం 80 కోట్లు ఖర్చు చేసినట్లు వస్తున్న వార్తలలో నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు.

Rajamouli: నాన్న అనే ఫీలింగ్ కలిగింది…

అలాగే ఈ ఇంటర్వ్యూలో రాజమౌళి గురించి మాట్లాడుతూ … ” రాజమౌళి తన తల్లిని పెళ్లి చేసుకోవడానికి ఏడాది ముందునుంచి తమ ఇంటికి వచ్చేవారని కార్తికేయ పేర్కొన్నారు. నన్ను, అమ్మను రాజమౌళి చాలా బాగా చూసుకునేవాడు. రాజమౌళి గారిపై ఆ సమయంలో ఫాదర్ ఫీల్ రావడంతో పాటు ఆ వైబ్ వచ్చేసిందని కార్తికేయ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అప్పటినుండి రాజమౌళిని వదలాలని అనిపించలేదని కార్తికేయ పేర్కొన్నారు. కార్తికేయ రాజమౌళి సొంత కొడుకు కాకపోయినా వారిద్దరూ తద్రికొడుకుల్లా ఉంటారు. చిన్ననాటి నుండి కార్తీకేయ జక్కన్నని బాబా అని పిలుస్తాడు.