Anjana Devi: టాలివుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఉన్న పేరు ప్రఖ్యాతలు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎవరి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చిరంజీవి హీరోగా అంచలంచెలుగా ఎదుగుతూ మెగా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఈ మెగా కుటుంబం నుండి వచ్చిన ఎంతోమంది ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్నారు.
ఇలా ఇండస్ట్రీలోకి ఎంతమంది హీరోలు వచ్చినా కూడా టాలీవుడ్ నంబర్ వన్ హీరోగా చిరంజీవిని దాటలేకపోతున్నారు. చిరంజీవి ఈ స్థాయికి చేరటానికి ఆయన తల్లి అంజనా దేవి కూడా ఒక కారణం. కొడుకుకి అన్ని వేళల్లో అండగా నిలిచింది. ఇదిలా ఉండగా మెగా కుటుంబంలో ఎంతో మంది హీరోలు ఉన్నారు. చిరంజీవి, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్ , పవన్ కళ్యాణ్ ఇలా ఇంతమంది హీరోలు ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు.
ఇలా మెగా కాంపౌండ్ నుంచి ఇంతమంది హీరోలు ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ చిరంజీవి తల్లి అంజనా దేవి గారికి మెగా హీరోలు కాకుండా అక్కినేని కుటుంబానికి చెందిన హీరో అంటే చాలా ఇష్టమట. సీనియర్ హీరో అక్కినేని నాగేశ్వరరావు అంటే అంజన దేవికి చాలా ఇష్టం. ఒకప్పుడు అక్కినేని గారు ఎక్కువగా ప్రేమ కథ చిత్రాలలోనే నటించి అమ్మాయిల మనసులను దోచుకుని అమ్మాయిల కలల రాకుమారుడుగా గుర్తింపు పొందాడు.
ఆ కాలంలో నాగేశ్వర రావుకి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగా ఉండేది. ఇక అంజనదేవి గారు చిన్ననాటి నుండి అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే చాలా ఇష్టమని తెలుస్తోంది. ఇక అంజనా దేవి కోడలు సురేఖతో కూడా ఎంతో ఆప్యాయంగా ఉంటుంది. ఇప్పటికీ ఈ అత్త కోడళ్ళు యువతరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…