Rajanikanth Vs Jayalalitha : చాలా కాలం తమిళనాడులో రజని వెర్సెస్ జయలలిత… ట్రాఫిక్ లో వెయిట్ చేయించినందుకు పగా తీర్చుకున్న రజని…!

Rajanikanth Vs Jayalalitha : కర్ణాటక బస్ కండక్టర్ గా జీవితం మొదలు పెట్టి నేడు తమిళ ప్రజలకు సూపర్ స్టార్ అయిన వ్యక్తి రజనీకాంత్. ఒక మామూలు వ్యక్తి తలచుకుంటే ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చు అని రజనీకాంత్ నిరూపించారు. ఎన్నో సూపర్ హిట్స్ ఆయన ఖాతాలో వేసుకుని సౌత్ లో అగ్ర హీరోల్లో ఒకరిగా ఉంటూ ఏడు పదుల వయసులోనూ హిట్లు కొడుతూ కొత్త వారికి పోటీగా ఉన్నారు. పీక్స్ లో స్టార్ డమ్ అన్నీ ఉన్నా కూడా రజనీకాంత్ గారు చాలా సింపుల్ గా ఉండటం ఆయన ప్రత్యేకత. అలాంటి రజనీకాంత్ గారికి తమిళనాడు మాజీ దివంగత సీఎం జయలలితతో కయ్యం పెట్టుకున్నారు. చాలా రోజులు వీరిద్దరి మధ్య గొడవ సాగింది.

ట్రాఫిక్ లో వెయిట్ చేయించినందుకు పగ తీర్చుకున్న రజని…

జయలలిత గారు సినిమాల్లో ఇంకా నటిస్తున్న సమయంలో రజనీకాంత్ ఇంకా కొత్తగా హీరోగా ఎదుగుతున్న సమయంలో ఒక సినిమాలో రజనీకాంత్ నటించాల్సి ఉండగా జయలలిత మొదట ఒకే చెప్పి ఆ తరువాత రామప్రభ కోసం శరత్ బాబుని పెట్టుకున్నారట. ఆ సినిమా చేసుంటే రజని కెరీర్ కి ఉపయోగపడేదని రజని జయలలిత గారితో మాట్లాడటానికి ఇంటికి వెళ్లగా ఆమె ఉండి కూడా లేనని చెప్పించి కలవడానికి నిరాకరించారు. అప్పటి అవమానంను గుర్తు పెట్టుకున్న రజని ఆమెతో దూరంగానే ఉన్నారు. అయితే జయలలిత సీఎం అయ్యారు, మరో వైపు రజనీకాంత్ సూపర్ స్టార్ అయ్యారు. ఆ సమయంలో ఒకసారి షూటింగ్ ముగించుకుని అలసిపోయి ఇంటికి సాయంత్రం బయలుదేరిన రజనీకాంత్ ను సీఎం అటు వైపు వస్తున్నారని ట్రాఫిక్ లో అరగంట పైగా ఆపేసారట. దీంతో చిరాకుపడిన రజనీకాంత్ కారు నుండి బయటికి వచ్చి ఒక లారీ ఎక్కి అందరినీ పలకరించి స్టైల్ గా సిగరెట్ తాగడంతో రోడ్డు మీద ఉన్న వారంతా ఒక్కసారిగా రజనీని చూడటానికి ఎగబడటంతో ట్రాఫిక్ పోలీసులు కూడా అదుపు చేయలేక చేతులెత్తేశారట. అదే సమయంలో అక్కడికి సీఎం కాన్వయ్ రావడంతో ట్రాఫిక్ జామ్ అయింది.

జయలలిత వెయిట్ చేయడంతో కోపం వచ్చి పోలీసుల మీద ఆరిచేసరికి రజనీకాంత్ మీకు ఐదు నిమిషాల ఆలస్యానికి కోపం వస్తోంది మరి మాకు గంటలపాటు ట్రాఫిక్ జామ్ చేస్తే మా పనులు ఆగిపోతాయి ఆ విషయం ఆలోచించరా అంటూ అడిగారట. ఇక మరుసటి రోజు మీడియాలో అంతా అదే న్యూస్ రావడంతో కోపం పెంచుకున్న జయలలిత రజని మీద ఐటి దాడులకు పురమాయించినా ఏమి లాభం రాలేదు. ఇక ఎన్నికలలో జయలలిత గురించి రజని నెగెటివ్ గా మాట్లాడటం వల్ల ఆ ఎన్నికల్లో డిఎంకే పార్టీకి లాభం చేకూరి గెలిచారు. అయితే వాళ్ళు వచ్చాక కూడా రజని ఇబ్బంది పెట్టారు. ఆ తరువాత రజని జయలలిత పాలనే కొంచం బాగుంది డిఎమ్కే పాలనకంటే అని రియలైజ్ అయ్యారు. ఆ విషయాన్నే బాహాటంగా చెప్పిన రజని తరువాత జయలలిత గారితో సఖ్యతగా ఉన్నారు. తన కూతుర్ల పెళ్లిళ్లకు పిలిచారు. ఆమె కూడా రజని తో బాగున్నారు. ఆమె మరణించినపుడు రజనికాంత్ ఒక గొప్ప వ్యక్తిని తమిళనాడు కోల్పోయిందంటూ కామెంట్స్ చేసారు.