Rakhi Pournima : రాఖి పండగ 30 నా లేక 31 వ తేదీ జరుపుకోవాలా… భద్ర కాలంలో రాఖి కడితే సోదరుడికి దోషం కలుగుతుందా…!

Rakhi Pournima : శ్రావణ మాసం లో వచ్చే పున్నమి కి సోదరుడికి రాఖి కట్టి తాను ఆనందంగా ఉండాలని అలాగే తనకు తన సోదరుడు రక్ష గా ఉండాలని ప్రతి ఆడపడుచు కోరుకుంటుంది. ఈ సంవత్సరం ఎప్పటి లాగ కాకుండా అధిక శ్రావణ మాసం రావడం ఇపుడు నిజం శ్రావణ మాసం రావడం జరిగింది. తాజాగా పున్నమి 30 వ తేదీ నుండి 31 ఉదయం వరకు కొనసాగుతుండటంతో అసలు రాఖి పండుగను ఏ రోజున జరుపుకోవాలని అందరూ ఆలోచిస్తున్నారు. ఇక అసలు సోదరుడికి రాఖి ఏ రోజున కట్టాలి అన్న విషయాలను పండితులు విశధికరిస్తున్నారు.

31 న రాఖి కట్టడం మంచిది….

రాఖి పున్నమి 30 వ తేదీన వచ్చిన ఆ రోజున రాఖి కట్టకూడదని పలువురు పండితులు చెబుతున్నారు. నిజానికి పంచాంగం లో చూసేటపుడు తిధి, వారం, నక్షత్రం, యోగం, కరణం ఇలా ఈ ఐదీంటిని చూడాలి. వీటిలో కరణం చూడటం ముఖ్యం. మనం చేసే పని ఏ కరణం లో చేస్తుంటే ఫలితం ఆ కరణం కి అధిపతి అయినా దేవుడికి వెళుతుంది. 12 కరణాలు ఉండగా వాటిలో ఒక్కో కరణం కు ఒక్కో విశిష్టత ఉంటుంది. కొన్ని కరణాల సమయంలో పూజలు మాత్రమే చేయాలి, వేరే శుభ కార్యాలు చేయరాదు. అలాగే మరికొన్ని కరణాల సమయంలో ఎటువంటి పనులు చేయరాదు అంటూ ఉంటాయి.

కాబట్టి వాటి ఆధారంగా శుభకార్యాలు చేయాలి. 30 వ తేదీన భద్ర కరణం ఉండటం వల్ల ఆరోజునా సోదరుడికి రాఖి కట్టకూడదు. భద్ర కరణం సమయంలో రాఖి కడితే సోదరుడికి మంచి జరుగదు కాబట్టి 31 న రాఖి జరుపుకోవడం ఉత్తమం . అధికాక మన హిందూ క్యాలండర్ లో సూర్య తిధి కి దగ్గరగా మనం మంచి పనులను చేయాలనుకుంటాం. అలా చుసినా 31 ఉదయం 7 గంటల లోపు రాఖి పండుగ జరుపుకుంటే శ్రేయస్కరం అని వేదపండితులు చెబుతున్నారు.