Ramyakrishna: సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూ స్టార్ హీరో హీరోయిన్లుగా గుర్తింపు పొందిన తర్వాత చాలామంది రాజకీయాలలోకి వెళ్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది ఇండస్ట్రీలో సక్సెస్ సాధించిన వారు రాజకీయాలలో కూడా కొనసాగుతున్నారు. అలాంటి వారిలో నటి రోజా ఒకరు.
ఇండస్ట్రీలో హీరోయిన్గా గుర్తింపు పొందిన ఈమె ప్రస్తుతం రాజకీయాలలోకి వచ్చి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఇలా రాజకీయాలలో కూడా ఎంతో సక్సెస్ అయినటువంటి రోజా బాటలోనే నటి రమ్యకృష్ణ కూడా రాజకీయాలలోకి రాబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇలా రమ్యకృష్ణ పొలిటికల్ ఎంట్రీ గురించి వార్తలు రావడానికి కారణం లేకపోలేదు. గత కొద్ది రోజుల క్రితం రోజా ఇంటికి రమ్యకృష్ణ వెళ్లడంతో అప్పటినుంచి ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రమ్యకృష్ణ ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు.
ఈ సందర్భంగా రమ్యకృష్ణ మాట్లాడుతూ తాను రోజా ఇండస్ట్రీలో ఇద్దరు మంచి స్నేహితులమని తెలిపారు. అయితే అప్పటికి ఇప్పటికీ మేమిద్దరం ఇలాగే ఉన్నామని తెలిపారు. ఇకపోతే చాలా సంవత్సరాల తర్వాత నేను తిరుపతికి వెళ్లగా అక్కడ స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది ఇలా స్వామివారి దర్శనం జరగడానికి రోజా కారణం కావడంతో తన ఇంటికి వెళ్లి తనకు కృతజ్ఞతలు తెలిపాను.
రోజా ఇంటికి వెళ్లిన నేను ఎలాంటి సినిమాల గురించి రాజకీయాల గురించి మాట్లాడలేదు కేవలం మా ఇద్దరి పిల్లల గురించి మాత్రమే మాట్లాడుకున్నామని తెలిపారు. అయినా ఒకరిని చూసుకొని తాను రాజకీయాలలోకి రావాలనుకోలేదు. నాకు రావాలనిపిస్తేనే వస్తానని తెలిపారు.అయితే ప్రస్తుతం నాకు రాజకీయాలలోకి రావాలని ఆసక్తి ఏమాత్రం లేదని అలా వచ్చినప్పుడు నేను ఈ విషయాన్ని చెబుతాను అంటూ ఈ సందర్భంగా రమ్యకృష్ణ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…