Upasana: అయోధ్య బాలరామయ్య సన్నిధిలో ఉపాసన.. అయోధ్యకు అపోలో సేవలు?

Upasana: మెగా కోడలిగా ప్రముఖ బిజినెస్ ఉమెన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఉపాసన తాజాగా తన పుట్టింటి వారితో కలిసి అయోధ్య బాల రామయ్యను దర్శించుకున్నారు. ఈమె తన తాతయ్య ప్రతాపరెడ్డితో పాటు తన అమ్మమ్మ అమ్మతో కలిసి అయోధ్యలోని బాల రాముడిని దర్శనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఉపాసన ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ విధంగా ఉపాసన అయోధ్య రామయ్యను దర్శించుకోవడమే కాకుండా అనంతరం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ని కూడా కలిశారు. ఇలా ఆయనతో కలిసి ఉపాసన అయోధ్యలో అపోలో హాస్పిటల్ ప్రారంభం గురించి ఎన్నో విషయాలను చర్చించారు. అనంతరం అపోలో హాస్పిటల్ ఫౌండర్ ప్రతాపరెడ్డి జీవిత చరిత్ర అయినటువంటి ది అపోలో స్టోరీస్ అనే పుస్తకాన్ని కూడా ముఖ్యమంత్రికి అందజేశారు.

ప్రతాపరెడ్డి అపోలో హాస్పిటల్ ఫౌండర్ అనే విషయం మనకు తెలిసిందే.ఈయన వైద్య రంగాన్ని దేశవ్యాప్తంగా విస్తరింప చేశారు. దేశవ్యాప్తంగా అపోలో హాస్పిటల్స్ ఎన్నో ప్రధాన నగరాలలో ప్రజలకు సేవలను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే అయోధ్యలో కూడా అపోలో హాస్పిటల్ ప్రారంభించాలనే ఆలోచన ఉపాసన చేశారు. ప్రస్తుతం అపోలో బాధ్యతలను తీసుకున్న ఉపాసన ఈ విషయాన్ని వెల్లడించారు.

ఎమర్జెన్సీ సేవలు ఉచితం..
ఇకపై అయోధ్యలో కూడా అపోలో హాస్పిటల్ ప్రారంభం కాబోతుందని అయితే అయోధ్యకు వచ్చే భక్తులకు ఎమర్జెన్సీ సేవలను అపోలో ఉచితంగా అందించబోతోంది అంటూ ఈ సందర్భంగా ఉపాసన తెలియజేయడమే కాకుండా తన తాతయ్య అపోలో సిబ్బందితో కలిసి దిగినటువంటి ఫోటోలను షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతున్నాయి.