Pavala Symala: పావలా శ్యామల పరిచయం అవసరం లేని పేరు. ఈమె ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించే ప్రేక్షకులను మెప్పించారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరి సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం వయసు మీద పడటంతో సినిమాలలో చేసే శక్తి లేక ఇండస్ట్రీకి దూరమయ్యారు.
ఇలా ఇండస్ట్రీకి దూరమైనటువంటి పావలా శ్యామల తాను సంపాదించిన ఆస్తులు అన్నింటిని తన కుమార్తె ఆరోగ్యం కోసం ఖర్చు చేసి చేతిలో చిల్లగవ్వ లేకుండా దీన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ విధంగా పావలా శ్యామల ఆర్థిక ఇబ్బందులను చూసి ఎంతో మంది సెలబ్రిటీలు ఆమెకు ఆర్థిక సహాయం చేసిన సంగతి మనకు తెలిసిందే.
ఇలా తనకు ఆర్థిక సహాయం చేయడంతో వారందరికీ ఈమె పలు సందర్భాలలో కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి పావలా శ్యామల ఇటీవల బుల్లితెరపై ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె మాట్లాడుతూ.. తాను ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టార్ హీరోలు అందరితో కలిసి సినిమాలు చేశాను కాని చివరికి నా బ్రతుకు ఇలా అవుతుందని ఊహించలేదు.
అవార్డులు అమ్ముకున్నాను…
నాకు ఎన్నో అవార్డులు వచ్చాయి ఎన్నో సత్కారాలు చేశారు కానీ నా ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఆ అవార్డులను కూడా అమ్ముకొని బ్రతికానని ఈమె ఎమోషనల్ అయ్యారు. ఇక ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది కూడా నా కష్టాలన్నింటిని మీతో చెప్పుకోవడానికి కాదు మీ అందరిని చివరి చూపు చూద్దామని వచ్చానని నేను ఎన్ని రోజులు బ్రతుకుతానో తెలియదు అంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ అక్కడ ఉన్నటువంటి వారందరిని కంటతడి పెట్టించాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…