Ramesh Babu Death: రమేష్ బాబు సూపర్ స్టార్ ఫ్యామిలీలో హీరోగా, ప్రొడ్యూసర్‌గా సక్సెస్ కాలేకపోవడానికి కారణం ఇదేనా?

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీలో నటులు, నిర్మాతలు ఉన్నారు. కృష్ణ.. తేనే మనసులు సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంబించారు. దాదాపు 350 పై చిలుకు చిత్రాలలో నటించి తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ అగ్ర నటుడుగా, నిర్మాతగా ఊహించని క్రేజ్ సంపాదించుకున్నారు. విజయ నిర్మలను రెండవ వివాహం చేసుకున్న కృష్ణ ఆమె దర్శకత్వంలో కూడా హీరోగా నటించి ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ఆ తర్వాత పద్మాలయ స్టూడియోస్ నిర్మాణ సంస్థను స్థాపించి బ్లాక్ బస్టర్స్ నిర్మించారు. ఈ సినిమాలలో ఎక్కువగా ఇండస్ట్రీ హిట్స్ సాధించినవే. నిర్మాణ రంగంలోనే కాదు సొంత స్టూడియోను స్థాపించి సినిమాలు తీశారు.

Ramesh Babu Death: సూపర్ స్టార్ ఫ్యామిలీలో హీరోగా, ప్రొడ్యూసర్‌గా సక్సెస్ కాలేకపోవడానికి కారణం ఇదేనా?

ఇలా కృష్ణ హీరోగా, నిర్మాతగా సక్సెస్ ఫుల్ జర్నీని కొనసాగించారు. ఆ తర్వాత ఆయన వారసులు ఇండస్ట్రీలోకి వచ్చారు. రమేష్ బాబు, మహేష్ బాబు, మంజుల నటులుగా, నిర్మాతలుగా మారి తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమాలను నిర్మిస్తూ, నటిస్తూ ఉన్నారు. కృష్ణ కూమార్తె మంజుల 1999లో ‘రాజస్థాన్’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ‘సమ్మర్ ఇన్ బెత్లెహెం’ అనే మలయాళ సినిమాలో హీరోయిన్ గా నటించారు. ఇక 2002 లో ‘షో’ అనే సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీలో విపరీతమైన గుర్తింపు సాధించారు.

అంతేకాదు ‘షో’ సినిమాలో నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకొని, జాతీయ స్థాయి ఉత్తమ చిత్రం, ఉత్తమ స్క్రీన్‌ప్లే పురస్కారాలు అందుకున్నారు. మంజుల తన సొంత ప్రొడక్షన్ హౌజ్ అయిన ఇందిరా ప్రొడక్షన్స్ ద్వారా సినిమాలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘నాని’, ‘పోకిరి’, ‘కావ్యాస్ డైరీ’, ‘ఏ మాయ చేశావే’, ‘మనసుకు నచ్చింది’ లాంటి సినిమాలు చేశారు. వీటిలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘పోకిరి’ 75 ఏళ్ళ తెలుగు సినిమా పరిశ్రమలోని రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టింది. భారీ కమర్షియల్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో మంజుల సోదరుడు, సూపర్ స్టార్ కృష్ణ తనయుడు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించాడు. మంచి కథ దొరికే మంజుల ఇప్పటికీ సినిమాలు నిర్మించడానికి రెడీగా ఉన్నారు.

ఇక ఈ ఫ్యామిలీలో మరో వారసుడు కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు. నటుడుగా, నిర్మాతగా సినిమాలు చేశాడు. అయితే ఘట్టమనేని ఫ్యామిలీలో అంతగా సక్సెస్ కాలేదంటే అది రమేష్ ఒక్కడే. మనషులు చేసిన దొంగలు, పాలు నీళ్ళు, నీడ వంటి సినిమాలలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన రమేష్, సామ్రాట్ సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత చిన్ని కృష్ణుడు, బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు, కృష్ణగారి అబ్బాయి, ఆయుధం, కలియుగ అభిమన్యుడు వంటి సినిమాలలో నటించాడు. కానీ హీరోగా స్టార్ డం దక్కలేదు. ఆ తర్వాత సొంతగా కృష్ణ ప్రొడక్షన్స్ స్థాపించారు.

ఈ నిర్మాణ సంస్థలో హిందీ ‘సూర్యవంశం’ నిర్మించారు. ఇది పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో తమ్ముడు మహేష్ బాబు హీరోగా ‘అర్జున్’ సినిమాను నిర్మించారు. ఈ సినిమా అద్బుతంగా ఉందనే ప్రశంసలు దక్కినప్పటికీ కమర్షియల్ గా మాత్రం నిరాశపరచింది. దీని తర్వాత మహేష్ హీరోగా యూటీవీ మోషన్ పిక్చర్స్ తో కలిసి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘అథిది’ సినిమాను నిర్మించి దెబ్బతిన్నాడు. చివరిగా రమేష్ బాబు సమర్పణలో ‘దూకుడు’ సినిమా వచ్చింది. ఈ సినిమా భారీ హిట్ సాధిచింది. ఈ సినిమా తర్వాత రమేష్ బాబు నిర్మాతగా, నటుడిగా ఇండస్ట్రీకి దూరమయ్యాడు. అయితే రమేష్ బాబు ప్రస్తుతం సూపర్ స్టార్ సొంత నిర్మాణ సంస్థలకి, ఇతర వ్యాపారాలకి సంబంధించిన పనులు చూసుకుంటున్నారు.

అయితే సూపర్ స్టార్ కృష్ణ కు ఉన్న భారీ ఇమేజ్ తో అయనకు పెద్ద ఎత్తున అవకాశాలు వస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు రమేష్ బాబు.. ఈ క్రమంలో అయన నటనపై పెద్దగా దృష్టి పెట్టలేదు, మరోవైపు ఆయనకున్న పలు అలవాట్ల వాళ్ళ ఆయన శరీరాకృతి కూడా మారిపోయింది. హీరోగా ఆయనను చూడలేని పరిస్థితి వచ్చేయడం మరోవైపు ఆయనకు సినిమాలపై ఆశక్తి కూడా తగ్గిపోవడంతో ఈ రంగానికి పూర్తిగా దూరమైపోయారు. గత కొద్దికాలంగా అయన పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. ఈ నేపధ్యంలో కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అయన శనివారం తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్ గచ్చిబౌలీ లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. అయితే అప్పటికే అయన మరణించినట్టు వైద్యులు వెల్లడించారు. అయన మృతి పట్ల పవన్ కళ్యాణ్ తో పాటూ పలువురు సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.