Unstoppable With NBK: సంక్రాంతి కానుకగా బాలయ్యతో లైగర్ ముచ్చట్లు…ట్విట్టర్ లో ఇలా..!
Unstoppable With NBK: నందమూరి బాలయ్య మంచి జోష్ లో ఉన్నాడు. అటు అఖండ సినిమా హిట్ తో .. ఇటు అన్ స్టాపబుల్ రియాల్టీ టాక్ షో విజయవంతంగా రన్ అవుతుండటంతో బాలయ్య సందడి ఓ రేంజ్ లో దూసుకుపోతోంది. ఆహా యాప్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో ఇటీవల ఇండియాలో ప్రసారం అవతున్న టాప్ షోల్లో ఒకటిగా నిలిచింది.
మోహన్ బాబు, రవితేజ, అల్లు అర్జున్, రాజమౌళి వంటి ప్రముఖులను ఈ షోకు గెస్ట్ లుగా వచ్చారు.
ఇదిలా ఉంటే ఇటీవల బాలయ్య అన్ స్టాపబుల్ షోకు రానా అతిథిగా వచ్చాడు. దీని తర్వాత వచ్చే షోకు సంబంధించి విశేషాలను ఆహా తన ట్విట్టర్ ఖాతాలో మరో పోస్టు చేసింది.
ఏంటంటే.. అందులో బాలయ్యతో కలిసి లైగర్ చిత్రయూనిట్ సందడి చేస్తున్నట్లు ఉంది. ఆ ఫోటోలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో పాటు.. చార్మి, విజయ్ దేవరకొండ ముఖ్య అతిథులుగా వచ్చారు. ఈ షోను సంక్రాంతి కానుకగా జనవరి 14న టెలికాస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. విజయ్ దేవరకొండ కెరీర్ లో మొదటిసారిగా పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా అనన్య పాండే నటిస్తున్న విషయం విధితమే. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక ఈ షోలో వాళ్లు ఎలా సందడి చేశారు. ఏమేమి మాట్లాడుకున్నారు.. మనకు తెలియని సినిమా విశేషాలు ఏమైనా ఉన్నాయా అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…