Rashmika: రష్మిక మందన్నా పేరు అదికాదంటా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రష్మిక మరో పేరు..!
Rashmika: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప మూవీ రికార్డులను క్రియేట్ చేస్తోంది. బన్నీ కెరీర్ లో తొలి పాన్ ఇండియా సినిమాగా వచ్చిన పుష్ప తొలి భాగం అభిమానులను ఆకట్టుకుంది.
రికార్డ్ స్థాయి కలెక్షన్లు కొల్లగొడుతోంది. హిందీ, తెలుగు, తమిళ్, మళయాళం భాషల్లో కూడా భారీ కలెక్షన్లనే రాబట్టింది. ఇదిలా ఉంటే ఎర్ర చందనం స్మగ్లర్ గా పుష్ప రాజ్ క్యారెక్టర్ లో బన్నీ ఇరగదీశాడు. ఇదిలా ఉంటే తొలిసారిగా రష్మికా మందన్న.. డీగ్లామరస్ రోల్ లో నటించింది.
తనే సొంతంగా చిత్తూర్ యాసలో డబ్బింగ్ చెప్పుకుంది. శ్రీవల్లి పాత్రలో పక్కా పల్లెటూరు అమ్మాయిగా చాలా న్యాచురల్ గా యాక్ట్ చేసింది. నేషనల్ క్రష్ రష్మికా పెర్ఫామెన్స్ కూడా సినిమాకు హైలెట్ గా నిలిచింది. ముఖ్యంగా పుష్పతో లవ్ ట్రాక్ చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది.
ఇదిలా ఉంటే ఈసినిమా తాజాగా జనవరి 7న ఓటీటీలోకి వచ్చింది. ఒక్క హిందీ తప్ప తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాకు ఫ్యాన్సీ రేట్ ఇచ్చారని తెలుస్తోంది. అయితే ఇదిలా ఉంటే.. అమెజాన్ చేసిన ఒక్క తప్పు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. సినిమా ముగిసిన తర్వాత సాధారణంగా నటీనటుల పేర్లు వేస్తుంటారు. అయితే రష్మికా మందన్న పేరుకు బదులు రష్మికా మడోనా అని వేయడం కనిపించింది. దీంతో నెటిజెన్లు ఊరుకుంటారా.. తమకు ట్రోలింగ్ కు మరో విషయం దొరికిందన్న రీతిలో చెలరేగిపోతున్నారు. అయితే ఈ విషయంపై రష్మికా ఎలా స్పందిస్తుందో చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…