Daggupati Rana: హీరోయిన్లతో రిలేషన్లో ఉన్న దగ్గుపాటి రానా.. బాలయ్య టాక్ షోలో ఆసక్తికర వ్యాఖ్యలు..!
Daggupati Rana: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఆహా ఓటిటి లో ‘అన్ స్టాపబుల్’ అనే టాక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వరుస సెలబ్రిటీస్ తో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న ఈ టాక్ షో లో తాజాగా దగ్గుపాటి రానా గెస్ట్ గా విచ్చేశారు.
ప్రస్తుతం ఈ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ టాక్ షోలో దగ్గుపాటి రానా ఎన్నో తన వ్యక్తిగత విషయాలను బాలయ్యతో పంచుకున్నాడు. దీనిలో రానాను బాలయ్య ఓ ప్రశ్న అడిగాడు.. 10 ఏళ్లుగా హీరోయిన్లతో రిలేషన్లో ఉన్నారట.. కానీ పెళ్లి మాత్రం బయట అమ్మాయిని పెళ్లి చేసుకున్నారట.. అసలు ఏంటి ఆ కథ.. అని అడిగాడు.
దీనికి అతడు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. సినీ పరిశ్రమలో అవి వర్కౌట్ కాలేదని.. తాను పెళ్లి చేసుకుంటానని చెబితే.. ఇంట్లో వాళ్లు షాక్ అయ్యారని చెప్పుకొచ్చాడు. మిమ్మల్ని రిజెక్ట్ చేసిన వాళ్లు ఎవరైనా ఉన్నారా అనే ప్రశ్నకు.. అలా తాను తిరస్కరించిన వాళ్లు చాలామంది ఉన్నారన్నారు.
బాలయ్య ఇంట్లో వాదనలు తానే మొదలుపెడతా అని.. సారీ కూడా తానే చెబుతా అని బాలయ్య చెప్పుకొచ్చాడు. ఇక పెళ్లి తర్వాత ఏనాడు తన భార్యకు ఐ లవ్ యూ చెప్పలేదని.. నా కన్నా తన భార్య ఎక్కువగా పార్టీలు చేస్తుందని వెల్లడించారు దగ్గుపాటి రానా. షూటింగ్ అన్నా.. షూటింగ్ లైప్ స్టైల్ అంటే తన భార్యకు తెలియదన్నాడు రానా. ప్రస్తుతం బాలయ్య టాక్ షోలో ఈ ఎపిసోడ్ కు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. రానా సినిమాలకు వస్తే.. ప్రస్తుతం హీరోగా విరాట పర్వం సినిమా షూటింగ్ పూర్తయి.. త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. హీరోయిన్ గా సాయిపల్లవి నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక భీమ్లానాయక్ సినిమాలో మొదటిసారి పవన్ కళ్యాణ్ తో రానా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…