Ramesh Babu : రమేష్ బాబు కోసం బాలకృష్ణ పై కృష్ణ కోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా?

తెలుగువీర లేవరా దీక్షబూని సాగరా.. అనే పాట వినగానే అల్లూరి సీతారామరాజు సినిమా గుర్తుకొస్తోంది. సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఆ సినిమాలో బాల సీతారామరాజుగా కృష్ణ గారి పెద్ద కొడుకు రమేష్ బాబు నటించారు. కృష్ణగారి కెరీర్లో గుర్తుండిపోయే దేశభక్తి సినిమా అల్లూరి సీతారామరాజు గా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత దొంగలకు దొంగ,మనుషులు చేసిన దొంగలు సినిమాల్లో రమేష్ బాబు యంగ్ క్యారెక్టర్ చేసినప్పటికీ.. హీరోగా మాత్రం సామ్రాట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

దాసరి దర్శకత్వంలో వచ్చిన నీడ సినిమాలో లీడ్ క్యారెక్టర్ లో రమేష్ బాబు కనిపించినప్పటికీ హీరోగా మాత్రం 1987 లో వి.మధుసూదనరావు దర్శకత్వంలో సామ్రాట్ అనే సినిమాలో సోనం సరసన హీరోగా రమేష్ బాబు ఎంట్రీ ఇచ్చాడు. అయితే హీరోగా చేసిన మొదటి సినిమాతోనే రమేష్ బాబు వివాదంలో చిక్కుకున్నారు.

పాతాళ భైరవి, మాయాబజార్, లవకుశ అడవి రాముడు లాంటి సినిమాలతో దూసుకెళుతున్న ఎన్టీ రామారావు గారి ఉనికిని పుణికిపుచ్చుకొని 1974లో తాతమ్మకల ఆ తర్వాత రామ్ రహీం, అన్నదమ్ముల అనుబంధం లాంటి సినిమాల్లో యంగ్ క్యారెక్టర్లో కనిపించిన బాలకృష్ణ 1984 లో వచ్చిన మంగమ్మగారి మనవడు చిత్రం మంచి బ్రేక్ ఇచ్చిందని చెప్పవచ్చు. అలా విజయపరంపరలో ఉన్న బాలకృష్ణకు ఓ సినిమా వివాదానికి కారణమైంది.

అలా 1987 వచ్చేసరికి కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా విజయశాంతి హీరోయిన్ గా సామ్రాట్ సినిమా షూటింగ్ మొదలైంది. అయితే ఇదే సంవత్సరంలో సూపర్ స్టార్ కృష్ణ తనయుడు రమేష్ బాబును హీరోగా పరిచయం చేస్తూ సామ్రాట్ సినిమా మొదలుపెట్టారు. బాలకృష్ణ రమేష్ బాబుల రెండు సినిమాల టైటిల్స్ ఒకే విధంగా ఉండటంతో సినిమా నిర్మాతల మధ్య అదేవిధంగా ఎన్టీఆర్, కృష్ణల మధ్య వివాదం మొదలైంది.

ఈ టాప్ స్టార్స్ టైటిల్స్ విషయంలో ఎంతకు తగ్గకపోవడంతో దాదాపు కోర్టుకు వెళ్లే పరిస్థితి వచ్చింది. చివరికి సినీ పరిశ్రమ పెద్దలు జోక్యం చేసుకోవడంతో వివాదం కాస్త సద్దుమణిగింది. బాలకృష్ణ సామ్రాట్ సినిమా టైటిల్ కి ముందు సాహస అని చేర్చడంతో సాహస సామ్రాట్ అనే పేరుతో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయింది. కానీ సామ్రాట్ టైటిల్ తో వచ్చిన రమేష్ బాబు చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించింది. ఇటీవల కాలంలో కత్తి, ఖలేజా సినిమాల విషయంలో కూడా ఇలాంటి వివాదమే వచ్చి సద్దుమనిగింది.