Pushpa The Rule: పుష్ప ది రూల్ ఐటెం సాంగ్ కోసం…స్పెషల్ ఫోకస్ పెట్టిన సుకుమార్..!
Pushpa The Rule: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషనల్ లో వచ్చిన ‘పుష్ప ది రైస్’ సినిమా గ్రాండ్ సక్సెస్ అయింది. అల్లు అర్జున్ కెరీర్ లో తొలి ప్యాన్ ఇండియా సినిమాగా వచ్చిన పుష్ప తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ భాషల్లో పెద్ద విజయం సాధించింది.
అన్ని భాషల్లో కూడా భారీగా కలెక్షన్లను రాబట్టింది. దీంతో రెండో భాగం ‘పుష్ప ది రూల్’ సినిమాపై భారీగా అంచానాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరిగే అవకాశం కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే చిత్ర విజయంలో సమంత ఐటెం సాంగ్ కీలక పాత్ర పోషించింది.
చాలా గ్యాప్ తరువాత సమంత స్క్రీన్ పై కనబడటం.. అది కూడా ఓ ఐటెం సాంగ్ చేయడంతో జనాల్లో క్యూరియాసిటీ మరింత పెరిగింది. సినిమా విడులకు ముందే ఈ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. దేశీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, ఇంద్రావతి చౌహాన్ హస్కీ వాయిస్ సాంగ్ ను ఓ రేంజ్ కు తీసుకెళ్లాయి.
ఈ ఐటమ్ సాంగ్ రికార్డ్ స్థాయిలో వ్యూస్ దక్కించుకుంది. ఇదిలా ఉంటే డైరెక్టర్ సుకుమార్ మరోసారి ఇదే ఫార్ములాను అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. పుష్ప రెండో భాగంలో కూడా ఓ ఐటెం సాంగ్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ భామను రంగంలోకి దించాలని చూస్తున్నాడు. అయితే ఈసాంగ్ కు సంబంధించి ఇప్పటికే కొంతమంది బాలీవుడ్ హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నారట. అయితే ఇంకా తుది నిర్ణయం వెలువడాల్సింది ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…