Trivikram-Mahesh Babu: మహేష్ బాబుకు తన అన్నకు మధ్య ఉన్న ఎమోషనల్ బాండ్ గురించి చెప్పిన త్రివిక్రమ్..!
Trivikram-Mahesh Babu: టాలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్ లో మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్ ఒకటి. వీరి కాంబినేషన్లలో వచ్చిన అతడు, ఖలేజా బాక్సాఫీస్ వద్ద పెద్దగా వసూళ్లు రాబట్టకపోయినా… ఆల్ టైమ్ క్లాసిక్ చిత్రాల జాబితాలో తప్పకుండా ఉంటాయి. ఇదిలా ఉంటే.. త్వరలో మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో చిత్రం రాబోతోంది.
దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే త్వరలో ఈసినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే మహేష్ బాబుకి తన అన్నయ్య రమేష్ బాబు అంటే ఎంత ఇష్టమో తెలిపే ఓ సంఘటన గురించి తెలిపాడు త్రివిక్రమ్.
ఖలేజా షూటింగ్ సమయంలో మహేష్ బాబుకు ఓ ఫోన్ వచ్చిందని.. ఆ ఫోన్ మాట్లాడిన తర్వాత కాస్త మూడీగా కనిపించడంతో ఏం జరిగిందని అడిగానని త్రివిక్రమ్ చెప్పారు. అయితే తన అన్నయ్య రమేష్ బాబుకు ఆరోగ్యం బాగా లేదని..జ్వరంతో బాధపడుతున్నారని అని చెప్పారు.
అయితే త్రివిక్రమ్ షూటింగ్ క్యాన్సిల్ చేద్దామా..అని అడిగితే వద్దులేంది భారీ బడ్జెట్ సినిమా కదా అని మహేష్ బాబు అన్నారని త్రివిక్రమ్ వెల్లడించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న తరువాత మహేష్ బాబు సెట్ నుంచి హస్పిటల్ వెళ్లిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఎవరికైనా చిన్న అనారోగ్యం వస్తేనే మహేష్ బాబు తట్టుకోలేరని.. అలాంటి ఆయన ఎంతగానో ప్రేమించే తన అన్నయ్య రమేష్ బాబు చనిపోవడం మహేష్ బాబుకు తీరని లోటని త్రివిక్రమ్ అన్నారు. అయితే కరోనాతో బాధపడుతున్న మహేష్ బాబు ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్నారు. దీంతో అన్న అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదు. సోషల్ మీడియా వేదికగా తన అన్నపై అభిమానాన్ని చాటుకున్నారు. ‘‘నువ్వే నాకు సర్వస్వం అన్నయ్య.. నువ్వు లేని నేను సగం మాత్రమే.. ఎన్ని జన్మ లైనా నువ్వే నాకు అన్నయ్యగా కావాలి’’ అంటూ సోషల్ మీడియాలో మహేశ్ బాబు పోస్ట్ చేసిన లెటర్ అందరి చేత కన్నీళ్లు పెట్టించింది. మహేశ్ హీరోగా నటించిన అర్జున్, అతిథి సినిమాలకు రమేశ్ బాబు నిర్మాతగా. దూకుడు, ఆగడు సినిమాలకు సమర్పకుడిగా వ్యవహరించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…