Samantha: మరోసారి నెగెటివ్ పాత్రలో సమంత.. ఈసారి అలా ప్రేక్షకులను భయపెట్టనుందా!
Samantha: నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత వరస పెట్టి సినిమాలు చేస్తోంది. ఇప్పటికే పుష్ఫ సినిమాలో చేసిన ‘ ఊ అంటావా మావా.. ఊఊ అంటావా..’ ఐటెం సాంగ్ తో దేశవ్యాప్తంగా సెన్సెషన్ క్రియేట్ చేసింది. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత నటించిన ఐటెం సాంగ్ కావడంతో జనాలు కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు.
సమంత అందాలు, దేశీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ తో యూట్యూబ్ లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ దక్కించుకుంది. ఇదిలా ఉంటే మరోవైపు క్రేజీ ప్రాజెక్ట్ లలో సమంత నటిస్తోంది. గుణ శేఖర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ శాకుంతలం సినిమాలో నటిస్తోంది. మరోవైపు తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ‘యశోధ’ మూవీని చేస్తోంది.
మరోవైపు హాలీవుడ్ మూవీలో కూడా నటిస్తోంది. హాలీవుడ్ మూవీ ‘అరెంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’ సినిమాలో తాను బై-సెక్సువల్ యువతి పాత్ర పోషిస్తున్న విషయాన్ని తానే ప్రకటించింది. ఇదిలా ఉంటే నెగిటివ్ రోల్ లో ఛాలెజింగ్ పాత్రలను చేస్తోంది సమంత. ఇప్పటికే ‘ ఫ్యామిలీ మ్యాన్2’ వెబ్ సిరీస్ లో నెగిటివ్ రోల్ ఉన్న పాత్రలో నటించింది.
అంతకుముందు కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం అయిన సమంత… ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో రాజీ పాత్రలో సూపర్ రోల్ చేసింది. అయితే తమిళంలో విజయ్ సేతుపతి, నయనతార, సమంత లీడ్ క్యారెక్టర్లుగా విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో ‘కాత్తువాక్కుల రెండు కాదల్’ సినిమా చేస్తున్నారు. అయితే.. ఈ సినిమాలో సమంత నెగిటివ్ రోల్ ప్లే చేస్తోంది. ‘ఖతిజా’ పాత్రలో విజయ్ సేతుపతి, నయన తార ప్రేమాయణానికి అడ్డుపడి సమంత తన విలనిజంతో కథను మలుపు తిప్పనుందట. అయితే ఈ క్యారెక్టర్ లో సమంత సూపర్ పెర్ఫామెన్స్ చేసిందని తమిళ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…