Ramesh Reddy : రవితేజ చేసిన పనికి హరీష్ శంకర్ నాతో సంవత్సరం మాట్లాడలేదు.. రవితేజకు ఫోన్ చేస్తే ఏంటి తొక్క అన్నాడు : రమేష్ రెడ్డి

Ramesh Reddy : సినిమాల్లో నటుడుగా, రైటర్ గా ఇండస్ట్రీ లో గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి రమేష్ రెడ్డి గారు. ఎక్కువగా డైరెక్టర్ హరీష్ శంకర్ తో కలిసి సినిమాలకు పనిచేసిన రమేష్ రెడ్డి గారు హరీష్ శంకర్ కు బాగా సన్నిహితుడు. హరీష్ శంకర్ అసోసియేట్ డైరెక్టర్ గా ఉన్నపటినుండి ఇద్దరికీ పరిచయం ఉండటం వల్ల అప్పటి నుండే ఇద్దరూ కలిసి పనిచేయాలని అనుకునేవారు. సినిమా స్క్రిప్ట్ విన్నప్పుడే అది హిట్ అవుతుందో ప్లాప్ అవుతుందో రమేష్ రెడ్డి గారు చెప్పేస్తారట అందుకే అయనను రెబెల్ రమేష్ అని పిలుస్తారట. ఇక నచ్చినా నచ్చకపోయినా సినిమా విషయంలో ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తారట రమేష్ రెడ్డి గారు, దానివల్ల అవకాశాలు కూడా వదులుకున్నారు.

రవితేజ వల్ల హరీష్ నాతో ఏడాది మాట్లాడలేదు…

హరీష్ శంకర్ గోపాల్ రెడ్డి గారి దగ్గర అసోసియేట్ గా ఉన్నప్పటి నుండి రమేష్ గారికి పరిచయం, దానితో హరీష్ సినిమాలకు అయన పనిచేసారు. వీళ్ళ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన రవితేజ ‘మిరపకాయ్’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక మళ్ళీ ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమా సమయంలో మళ్ళీ రవితేజ కాంబినేషన్ లో సినిమా చేయాలని హరీష్ శంకర్, రమేష్ రెడ్డి గారి తో చెప్పడం జరిగింది. ఇంకా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా షూటింగ్ పనుల్లో హరీష్ శంకర్ ఉన్నపుడు రవితేజ రమేష్ రెడ్డి గారికి ఫోన్ చేసి మీరు చెప్పిన కథ దిల్ రాజు గారు నాకు వేణు శ్రీ రామ్ ద్వారా చెప్పారు సినిమా చేస్తున్నాను అయితే హరీష్ కి చెప్పొద్దు సీక్రెట్ అని చెప్పారట. ఇక సీక్రెట్ అన్నాడు కదా అని హరీష్ తో చెప్పలేదట రమేష్ గారు. అయితే హరీష్ కి కొద్ది రోజులకు రవితేజ సినిమా వేణు శ్రీరామ్ తో ఓకే అయింది అని రమేష్ గారితో చెప్పినా ఏమీ తెలియనట్లు విని రమేష్ పొరపాటు చేసారు. కొన్నిరోజులకు రవితేజ స్వయంగా హరీష్ తో ఇలా సినిమా చేస్తున్నా వేణు శ్రీరామ్ తో, అది రమేష్ రెడ్డి కథ అని చెప్పారట.

రమేష్ కి ముందే తెలుసు నేను చెప్పాను అన్నాడట. దీంతో హరీష్ రమేష్ రెడ్డి తో మాట్లాడలేదట. ఇక సంవత్సరం పాటు ఎడమొఖం పెడ మొఖం ల ఉన్నారట, అయితే మళ్ళీ హరీష్ సీక్రెట్ అన్నారు కాబట్టి నాతో చెప్పలేదు అంతే కానీ ఇంకేం కాదు అని మళ్ళీ కలిసి పనిచేసారు. ఇక ఇదే విషయంలో రవితేజ కి ఫోన్ చేసి నాకు చెప్పొద్దు అని చెప్పి మీరెందుకు చెప్పారు అని రమేష్ రెడ్డి గారు అడిగితే సీక్రెట్ నీకు నాకు కాదు, ఇపుడు నాతో హరీష్ మాట్లాడటం లేదు సరిగా అని రమేష్ రెడ్డి గారు అంటే ఆ అయితే ఏంటి తొక్క ఇపుడు… ఇంకొన్ని రోజులకు తానే మాట్లాడుతాడు లే మీ ఇద్దరి కాంబినేషన్ బాగుంటుంది అంటూ చెప్పాడట.