బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్.. వెలుగులోకి కొత్తరకం మోసం..?

దేశంలో మోసాల సంఖ్య, మోసగాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఒక మోసం వెలుగులోకి వచ్చేలోపు మరో కొత్తరకం మోసం వెలుగులోకి వస్తూ ఉండటంతో చాలామంది అమాయకుల ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. తాజాగా మరో కొత్తరకం మోసం వెలుగులోకి రావడంతో ఆర్బీఐ బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి హెచ్చరికలు జారీ చేసింది. బ్యాంక్ ఖాతాదారులు జాగ్రత్తగా ఉండాలని కీలక సూచనలు చేసింది.

సైబర్ మోసగాళ్లు మొబైల్ నంబర్ల సహాయంతో ఈ మోసాలకు పాల్పడుతూ ఉండటం గమనార్హం. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వెబ్ సైట్ లో ఆర్బీఐ చేసిన సూచనలను ఎస్బీఐ సైతం వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లు, ఇతర బ్యాంక్ ఖాతాదారులు సైబర్ మోసాల పట్ల అవగాహన పెంచుకుంటే మంచిది.

సైబర్ మోసగాళ్లు సాధారణంగా బ్యాంకులు కస్టమర్లకు కాల్ చేయడం కోసం వినియోగించే టోల్ ఫ్రీ నంబర్ల సహాయంతో కస్టమర్లకు కాల్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. దేశంలో ఈ తరహా మోసాలు ఈ మధ్య కాలంలో వెలుగులోకి వస్తున్నాయి. యాప్స్ కూడా బ్యాంకుల నుంచే కాల్స్ వచ్చినట్టు చూపిస్తూ ఉండటంతో బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లు సైబర్ మోసగాళ్ల చేతిలో సులువుగా మోసపోతున్నారు.

మరి కొందరు మోసగాళ్లు బ్యాంక్ టోల్ ఫ్రీ నంబర్లను పోలి ఉన్న ఫోన్ నంబర్లు తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. రోజురోజుకు మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంక్ ఖాతాదారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే సులభంగా మోసాలకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది.