దేశంలో కోట్ల సంఖ్యలో ప్రజలు ప్రభుత్వ రంగ బీమా సంస్థలలో ఒకటైన ఎల్‌ఐసీ అందిస్తున్న పాలసీలను తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఎల్‌ఐసీ పాలసీదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. స్పెషల్ రివివల్ కాంపెయిన్ పేరుతో మధ్యలో పాలసీలను ఆపివేసిన వారికి పాలసీలను పునరుద్ధరించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ నెల 7వ తేదీన ఎల్‌ఐసీ స్పెషల్ రివివల్ కాంపెయిన్ ప్రారంభమైంది.
ఎల్‌ఐసీ పాలసీదారులు ఎవరైనా ఎల్‌ఐసీ పాలసీ తీసుకుని ప్రీమియం చెల్లించకుండా ఉండి ఉంటే ల్యాప్స్ అయిన పాలసీని పునరుద్ధరించుకునే అవకాశం ఉంటుంది. అయితే పాలసీని పునరుద్ధరించుకోవాలన్నా మార్చి 6వ తేదీలోపు మాత్రమే పునరుద్ధరించుకోవాలి. ఆ తరువాత పాలసీని పునరుద్ధరించుకోవాలన్నా కుదరదు. దేశంలోని లక్షల సంఖ్యలో పాలసీదారులకు ఎల్‌ఐసీ తీసుకున్న నిర్ణయం వల్ల ప్రయోజనం చేకూరనుంది.
గడిచిన ఐదు సంవత్సరాల నుంచి ప్రీమియం చెల్లించని వాళ్లు స్పెషల్ రివివల్ కాంపెయిన్ ద్వారా ప్రయోజనం పొందవచ్చు. మార్చి 6వ తేదీ తరువాత పాలసీలను పునరుద్ధరించుకోవాలంటే మాత్రం ఆలస్య ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు పాలసీ తీసుకుంటే తక్కువ ఫీజుతోనే పాలసీని రాయితీకి పొందే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాల వల్ల పాలసీలను తీసుకోలేదో వారికి ఎల్‌ఐసీ తీసుకున్న నిర్ణయం వల్ల ప్రయోజనం చేకూరనుంది.
సమీపంలోని ఎల్‌ఐసీ బ్రాంచ్ లను సంప్రదించి పాలసీలకు సంబంధించిన పూర్తి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. అయితే ఎంపిక చేసిన పాలసీలకు మాత్రమే ఎల్‌ఐసీ స్పెషల్ రివివల్ కాంపెయిన్ ద్వారా పాలసీలను పునరుద్ధరించుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఉండటం గమనార్హం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…