Featured

భూమికి ప్రళయం ముంచుకొస్తోందా.. వేగం పెరగడానికి కారణాలివేనా..?


రోజుకు ఎన్ని గంటలు అనే ప్రశ్నకు చిన్నపిల్లాడి నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ 24 గంటలు అని చెబుతారు. భూ భ్రమణాన్ని బట్టి రోజుకు 24 గంటలు మాత్రమేనని ప్రజలు భావిస్తారు. అయితే ఇకపై రోజుకు 24 గంటలు అని చెప్పడం తప్పయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా తిరిగే వేగంతో పోల్చి చూస్తే భూమి దాని అక్షంపై వేగంగా తిరుగుతుండటంతో రోజులో గంటల లెక్క మారిపోయే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

మరోవైపు దశాబ్దాల నుంచి మెల్లగా తిరిగిన భూమి ఊహించని విధంగా వేగంగా తిరగడం ఖగోళ శాస్త్రవేత్తలను కంగారు పెడుతోంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం భూమి సూర్యుని చుట్టూ 420 సార్లు పరిభ్రమించింది. ఆ తరువాత భూమి వేగం 420 సార్ల నుంచి 410కు తగ్గింది. భూమి వేగంలో మార్పులు రావడానికి వేర్వేరు కారణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

భూమికి చంద్రుడు దూరంగా కదలడం, భూమిలోని సముద్రమట్టం స్థాయిలో మార్పులు, ఇతర కారణాల వల్ల భూమి భ్రమణంలో వేగం పెరిగి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భూమి వేగంగా తిరగడం వల్ల తొలిసారి భూమి భ్రమణానికి నెగిటివ్ లీపు సెకను అవసరం పడిందని తెలుస్తోంది. వేగం పెరగడం వల్ల సాధారణంగా ఉండే రోజు కంటే సగటు రోజు 0.05 మిల్లీ సెకన్లు తక్కువగా ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

సీనియర్ శాస్త్రవేత్త పీటర్ విబ్బర్లీ గత 50 సంవత్సరాలతో భూమి ఇప్పుడు ఎంతో వేగంగా తిరుగుతోందని కచ్చితంగా చెప్పవచ్చని తెలుపుతున్నారు. భూమి దాని అక్షంపై వేగంగా కదలడం వల్ల దేశాల సమయాలు మారతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

4 hours ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

4 hours ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

5 hours ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

22 hours ago

పేద దేశాల నుంచి వలసలకు బ్రేక్.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. అమెరికా భవిష్యత్తుపై ఆందోళన

అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…

22 hours ago

మన బట్టలపై కనిపించే S, M, L సైజ్ ట్యాగ్ వెనుక భారీ చరిత్ర..

ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…

23 hours ago