సామ్ జామ్ ఎండ్ కార్డ్ పడటానికి కారణం అదేనా?

ఓటీటీ ఫ్లాట్ ఫామ్ వేదికగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్వహించిన “ఆహా” యాప్ ద్వారా ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ సమంత “సామ్ జామ్”అనే టాక్ షో కి వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ షో ద్వారా ప్రముఖ సినీ సెలబ్రిటీస్ ను ఆహ్వానించి వారి వ్యక్తిగత, సినిమా విషయాలను గురించి పలు ఆసక్తికరమైన విషయాలను సమంత ప్రశ్నల రూపంలో అడిగి సమాధానాలను రాబడుతున్నారు. ఇప్పటికే ఈ షో ద్వారా మెగాస్టార్ చిరంజీవి, రానా, అల్లు అర్జున్, రకుల్, నాగచైతన్య వంటి సెలబ్రిటీస్ పాల్గొన్నారు.

ఈ షోలో సినిమా సెలబ్రిటీస్ పాల్గొనడం వల్ల ఈ షో ను ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఆదరిస్తారనే ఉద్దేశంతో కోట్ల రూపాయలు ఖర్చుతో భారీ సెట్ డిజైన్ చేసారు నిర్మాతలు. దీంతో ఈ షో వంద ఎపిసోడ్లను పూర్తి చేసుకోవడం గ్యారెంటీ అని ఆహా నిర్వాహకులు భావించారు. అయితే వీరందరి అంచనాలను చేరకుండానే పట్టుమని పది ఎపిసోడ్లు కూడా ప్రసార కాకుండానే “సామ్ జామ్”టాక్ షో కి ఎండ్ కార్డ్ పడింది.

ఓటీటీ ఫ్లాట్ ఫామ్ వేదికగా ఆహా యాప్ ద్వారా ప్రసారమయ్యే ఈ షోను ప్రేక్షకులు ఎవరు ఆసక్తిగా చూడకపోవడం వల్ల ఈ షో కి మంచి స్పందన రాకపోవడంతో సామ్ జామ్ కి ఎండ్ కార్డ్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ షో కేవలం యూట్యూబ్ లో కొన్ని ఛానళ్లకు మాత్రమే మంచి అవకాశంగా మారిందే తప్ప తెలుగు సినీ టీవీ ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేక పోయిందని చెప్పవచ్చు. ఈ షో నిర్వహించినందుకు నిర్మాత నష్టాలను చవి చూశారనే చెప్పవచ్చు. ఈ షో కి వ్యాఖ్యాతగా చేసినందుకుగాను సమంత మాత్రం సంతృప్తికరంగా రెమ్యునరేషన్ లబ్ధి పొందారని తెలుస్తోంది.