Featured

వైరల్: లేడీస్ హాస్టల్ లోకి దూరిన చిరుత.. చివరికి?

ప్రస్తుతం మన ప్రపంచం అభివృద్ధి బాటలో పయనించడం వల్ల ఎన్నో అరణ్యాలను నాశనం చేస్తున్నారని చెప్పవచ్చు. దీని ఫలితంగా అడవులలో నివసించే ఎన్నో జంతువులు ఆవాసం కోల్పోయి అవి జనారణ్యంలోకి రావడం మొదలుపెట్టాయి. ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలను మనం ఎన్నో చూసి ఉంటాం. అచ్చం ఇలాంటి సంఘటనే కర్ణాటకలో చోటు చేసుకుంది. ఎక్కడో అరణ్యంలో సంచరించ వలసిన చిరుత జనారణ్యంలోకి వచ్చి ఒక లేడీస్ హాస్టల్ లోకి దూరిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.కర్నాటకలోని చామరాజ్నగర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని ఓ మెడికల్ కాలేజీలో గల లేడిస్ హాస్టల్ లోకి బుధవారం రాత్రి ఓ చిరుతపులి ప్రవేశించింది.అయితే హాస్టల్ లోకి ప్రవేశించిన ఆ పులి హాస్టల్ మొదటి ఫ్లోర్ లో అటు ఇటు తిరుగుతూ విద్యార్థుల గదివైపు వెళ్ళింది. ఆ సమయంలో విద్యార్థులందరూ గది తలుపులు వేసుకొని లోపల నిద్రపోవటం వల్ల పులి నుంచి వారికి పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. అయితే ఈ పులి హాస్టల్ లోకి ప్రవేశించిన దృశ్యాలు సీసీ టీవీ కెమెరాలలో రికార్డయ్యాయి.

లేడీస్ హాస్టల్ లోకి ప్రవేశించిన ఈ పులి కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన హాస్టల్ విద్యార్థులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఒకవేళ ఆ టైంలో ఎవరైనా తలుపులు తీసి ఉంటే పెద్ద ప్రమాదం వాటిల్లేదని ఈ వీడియో చూసిన నెటిజన్లు భావిస్తున్నారు. అయితే ఈ విధంగా పులులు సింహాలు అరణ్యం నుంచి బయటకు రావడానికి 100% మనుషులే కారణమని చెప్పవచ్చు. పారిశ్రామిక రంగాల అభివృద్ధి పేరిట కొన్ని వందల ఎకరాల్లో అడవులను నాశనం చేయడం ద్వారా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ పులి కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago