ఒకప్పటి హీరో కళ్యాణ్ చక్రవర్తి బాలకృష్ణ కు ఏమవుతారో మీకు తెలుసా.?!

1980 దశకంలో ఎంతో మంది కథానాయకులు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. సుమన్, రాజశేఖర్, నాగార్జున, వెంకటేష్, సురేష్, శ్రీకాంత్ లాంటి ఎంతో మంది హీరోలు తెలుగు తెరకు పరిచయమయ్యారు. అలా 1988లో అత్తగారు స్వాగతం అంటూ ఎన్టీ రామారావు సోదరుని కుమారుడు త్రివిక్రమరావు కొడుకు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి వెండితెరకు పరిచయమయ్యారు.

అయితే రామారావు సోదరుడైన N.త్రివిక్రమరావు కో ప్రొడ్యూసర్ గా శ్రీకృష్ణసత్య, వరకట్నం, ఉమ్మడి కుటుంబం సీతారామ కళ్యాణం, గులేబకావళి కథ, జై సింహ, తోడుదొంగలు, పిచ్చి పుల్లయ్య లాంటి చిత్రాలను నిర్మించారు. 1988 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో భానుమతి రామకృష్ణ ప్రధానపాత్రలో వచ్చిన అత్తగారు స్వాగతం చిత్రంలో అశ్విని తో జత కడుతూ హీరో కళ్యాణ్ చక్రవర్తి వెండితెరపై కనిపించాడు. ఆ తర్వాత హీరోయిన్ కల్పనతో మామ కోడళ్ళ సవాల్ లో చిందేశారు. తర్వాత కళ్యాణ్ చక్రవర్తి హీరోయిన్ ఊర్వశి తో ఇంటి దొంగ అ చిత్రంలో నటించారు. ఖుష్బు హీరోయిన్ గా కళ్యాణ్ చక్రవర్తి ప్రేమ కిరీటం సినిమాల్లో కనిపించారు.

హీరోయిన్ అశ్వినితో రౌడీ బాబాయ్ అలాగే హీరోయిన్ రజిని తో మేనమామ అనే చిత్రంలో నటించారు. ఆ తర్వాత 1989లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన లంకేశ్వరుడు చిత్రం లో మెగాస్టార్ చిరంజీవికి కి చెల్లెలి భర్తగా అంటే చిరంజీవికి బావ గా కళ్యాణ్ చక్రవర్తి నటించారు. ఆ తర్వాత 1994 వచ్చేసరికి తెలుగు సినీ పరిశ్రమ మద్రాస్ నుండి హైదరాబాదుకు షిఫ్ట్ కావడం మూలంగా అప్పుడే తన తండ్రి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఈ గందరగోళంలో మద్రాసులోనే ఉండిపోయారు. తర్వాత తనకు సినిమాలకంటే తండ్రి ఆరోగ్యమే ముఖ్యమని ఆయనకు సేవలు చేస్తూ మద్రాసులోనే ఉండిపోయారు. తర్వాత కొన్ని రోజులకు తండ్రి మరణించడంతో తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లి పోయారు.

అలా ఆయన సినిమాల్లో నటించలేక పోయారు. తర్వాత ఆయన తన వారసత్వంగా సినిమాల్లోకి తన పిల్లలు ఎవరిని ఇంట్రడ్యూస్ చేయలేదు. విజయవాడ గాంధీ నగర్ లో కళ్యాణ్ చక్రవర్తి పేరిట ఏకంగా ఒక థియేటర్ ఉంది. ఆ‌ థియేటర్ ను ఇప్పుడు కమర్షియల్ కాంప్లెక్స్ గా మార్చారు. అయితే కళ్యాణ్ చక్రవర్తి నందమూరి బాలకృష్ణ కు బాబాయ్ కొడుకు అనగా గా బాలకృష్ణకు కు సోదరుడిగా చెప్పుకోవచ్చు.