RGV: ఇక బాలీవుడ్ సినిమాలు ఓటీటీ లోనే.. ఆర్జీవీ కామెంట్స్..!

RGV : వివాదాల జీవి ఆర్జీవీ నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తుంటారు. ప్రతిసారి ఏదో ఒక అంశం పై తన దైన శైలిలో మాట్లాడుతాడు. ఇక ఈ మధ్య కాలంలో దక్షిణాది సినిమాలు ఉత్తరాదిన బాగా హిట్ అవుతున్నాయి. బాహుబలి, పుష్ప , ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ సినిమాలు బాలీవుడ్ లో అంచనాలకు మించి సత్తా చాటాయి. ఈ విజయాలు బాలీవుడ్ జనాలకు రుచించడం లేదు ప్రేక్షకులు ఏమి కోరుకుంటున్నారో తెలుసుకోలేక బాలీవుడ్ ఇండస్ట్రీ వెనుక పడుతోందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇక నార్త్ వెర్సెస్ సౌత్ అన్నట్టుగా సాగుతున్న ట్వీట్ వార్ లో ఆర్జీవీ నిత్యం ఏదో ఒక పోస్ట్ పెడుతూ రచ్చ చేస్తున్నారు. మొన్నా మధ్య హిందీ జాతీయ భాషా వివాదంలో కూడా ఆర్జీవీ తన వంతు పాత్ర పోషించాడు. సౌత్ హీరోలతో బాలీవుడ్ హీరోలు సినిమాలను తీసి కలెక్షన్స్ తో పోటీపడాలని సూచించారు.

ఓటీటీ లో విడుదల చేసుకొండి….

ఇక జెర్సీ సినిమా హిందీ రీమేక్ విషయంలో కూడా ఇలాగే మాట్లాడాడు ఆర్జీవీ, సినిమాను మళ్ళీ తీయడం కంటే తెలుగు సినిమాను డబ్ చేసుంటే నిర్మాతకు లాభాలు వచ్చేవి. సినిమా బడ్జెట్ మిగిలేది అంటూ కామెంట్స్ చేసాడు. ఇక ఎపుడు మరోసారి సోషల్ మీడియా వేదికగా బాలీవుడ్ పరువు తీసేసాడు. సౌత్ సినిమాలు ముఖ్యంగా తెలుగు సినిమాల హవా బాలీవుడ్ లో పెరుగుతుండడం ఇక మహేష్ బాలీవుడ్ నన్ను భరించలేదు అంటూ చేసిన వాఖ్యల గురించి స్పందిస్తూ సౌత్ సినిమాలు థియేటర్లలో మంచి విజయాలను అందుకుంటుంటే ఇక బాలీవుడ్ తన సినిమాలను ఓటీటీ కోసమే తీయాల్సి వస్తుంది అంటూ కామెంట్ చేసాడు. ఇపుడు ఈ మాటలు వైరల్ అవుతున్నాయి. ఇక బాలీవుడ్ బడా బాబులు ఈ మాటలకు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.