RGV: ఇండస్ట్రీలో ప్రతి వాడికి స్వార్ధమే.. ‘పెద్ద దిక్కు’ అని టైటిల్ ఇచ్చినంత మాత్రాన వాడి మాట ఎవడూ వినడు : అర్జీవీ

Ram Gopal Varma: సినీ దిగ్గజం.. దాసరి నారణయణరావు చనిపోయిన తర్వాత సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు ఎవరనే దానిపై పెద్ద చిక్కు వచ్చి పడింది. చాలామంది మెగస్టార్ చిరంజీవి అని భావిస్తుండగా.. పెద్దన్నగా మాత్రం తాను ఉండను అంటూ ఇటీవల అతడు వ్యాఖ్యలు చేసేశాడు. దీని తర్వాత ఇండస్ట్రీలో ఈ టాపిక్ పెద్ద సంచలనంగా మారింది. సినీ ప్రముఖులు దీనిపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఎవరికీ తోచిన విధంగా వాళ్లు మాట్లాడేస్తున్నారు. చిరంజీవి అలా ప్రకటన చేసిన వెంటనే.. మోహన్ బాబు కూడా సినీ పరిశ్రమ విషయంలో మౌనంగా ఉంటున్నామని చేతకాని తనంగా అనుకోవద్దని ఘాటుగా మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వానికి లేఖ కూడా రాశాడు.

RGV: ఇండస్ట్రీలో ప్రతి వాడికి స్వార్ధమే.. 'పెద్ద దిక్కు' అని టైటిల్ ఇచ్చినంత మాత్రాన వాడి మాట ఎవడూ వినడు : అర్జీవీ

సినీ పరిశ్రమ అంటే కేవలం నలుగురు హీరోలు, నలుగురు ప్రొడ్యూసర్లు, నలుగురు డిస్ట్రిబ్యూటర్లు కాదన్నారు. అందరినీ సమానంగా చూడాలని.. అందరూ కలిసి.. పరిశ్రమ సమస్యలపై పోరాడాలన్నారు. ఒకరోజు కూర్చొని ప్రభుత్వంతో చర్చలు జరపాలన్నారు. ఎవరూ ఎక్కువ కాదు.. తక్కువ కాదు అంటూ స్పష్టం చేశాడు.

RGV : సామీ మీరు రావాలి సామీ.. మీరే దిక్కు..

టికెట్ల వ్యవహారంపైనే ప్రస్తుతం ఇదంతా తిరుగుతోంది. దీనిపై రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించారు. టికెట్ల రేట్లను తగ్గించడానికి ప్రభుత్వం ఏదైనా ప్లాన్ చేసిందా.. ఆ ప్లాన్ వెనుకు సినిమాలో ఉన్న ఒకరిద్దరు హీరోల్ని తొక్కేయాల్నే కారణంగానే ఇలా చేస్తున్నారా..అనే డౌట్ ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు ఆర్జీవీ. ఆర్జీవీ ట్వీట్ పై అతడు శిష్యూడు ఆర్ఎక్స్ 100 దర్శకుడు ట్వీట్ చేశాడు. సినీ పరిశ్రమకు మీరే పెద్ద దిక్కు ‘సామీ మీరు రావాలి సామీ’ అంటూ రాసుకొచ్చాడు. ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఇందతా జరుగుతున్నా.. కొంతమంది మాత్రం ఇండస్ట్రీకి పెద్ద దిక్కు చిరంజేవే అని.. కొందరు అంటుంటు.. మరి కొందరు మోహన్ బాటు అంటూ.. ఎవరికీ వారు తమ అభిప్రాయాలను చెబుతున్నారు.

RGV : ఇండస్ట్రీ వాళ్ళకి పెద్ద దిక్కు ఉండాలనుకోవడం మూర్ఖత్వం :

Ram Gopal Varma: దానికి ఆర్జీవీ మాత్రమే అర్హుడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ దర్శకుడు?

అజయ్ గారూ, ఇండస్ట్రీ వాళ్ళకి పెద్ద దిక్కు ఉండాలనుకోవడం మూర్ఖత్వం. ఎందుకంటే, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి వాడికీ వేరే వేరే స్వార్ధాలు ఉంటాయి. దాని మూలాన వాడికి మాత్రమే పనికొచ్చే మాటే ప్రతివాడూ వింటాడు. కానీ, ఎవడికో పెద్దదిక్కు అని టైటిల్ ఇచ్చినంత మాత్రాన వాడికి మాట ఎవడూ వినడు.