Sudigaali Sudheer: తెలుగు టెలివిజన్ షోల్లో జబర్థస్త్ తర్వాతే మరేదైనా.. అంతలా ఆకట్టుకుంటోంది. జబర్థస్త్ ప్రారంభం అయినప్పటి నుంచి ఈ షోకు విపరీతమైన రెస్పాన్స్ వస్తూనే ఉంది. ఎక్కడా టీఆర్పీ రేటింగులు తగ్గకుండా తన మార్క్ ను కంటిన్యూ చేస్తోంది జబర్థస్త్ షో. గురు, శుక్రవారాల్లో ఈటీవీలో ప్రసారం అయ్యే జబర్థస్త్, ఎక్స్ ట్రా జబర్థస్త్ షోలకు విపరీతమైన క్రేజ్ ఉంది.
ఇటు కంటెస్టెంట్ల కామిడీ స్కిట్లతో పాటు.. జబర్థస్త్ భామలుగా పేరు తెచ్చుకున్న అనసూయ, రష్మీలు మరో ప్రధాన ఆకర్షణ అని చెప్పుకోవాలి. వీరితో పాటు యాంకర్ రోజా, మనోలతో పాటు సుడిగాలి సుధీర్, ఆది పంచులు షోకే పెద్ద ఎస్సెట్. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన రెండు షోలకు అనసూయ యాంకరింగ్ చేయలేదు.
ఈ రెండు షోలను రష్మీతోనే లాగించారు. అయితే తాజాగా మళ్లీ అనసూయ జబర్థస్త్ కు ఎంట్రీ ఇచ్చింది. ’ ఏయ్ బిడ్డా ఇది జబర్థస్త్ సరికొత్త అడ్డా‘ అంటూ ఎంట్రీ ఇచ్చింది. కొత్త ఏడాదిలో సరికొత్త జబర్థస్త్ సెట్ మనముందుకు వస్తోంది.
ఈనెల 6న టెలికాస్ట్ అయ్యే షో ప్రోమోలో అనసూయ, హైపర్ ఆది, సుధీర్ ఇరగదీశారు. ప్రోమోలో ఆది పంచులు, సుడిగాలి సుధీర్ స్కిట్లో పంచులు పేలాయి. ఆది నీళ్లు తాగుతుంటే.. ఇంకా తాగవా..అని సుధీర్ అడగ్గా నీ అంత దాహం లేదని ఆది పంచ్ వేశాడు. మానవా.. మానవా.. అంటూ లేడి గెటప్పు సుధీర్ ని అడిగితే.. ఇప్పటికే ’ఢీ‘ మానేశాను ఇంకేం మానేయాలి అంటూ తనపై తానే సెటైర్ వేసుకున్నాడు. ఇటీవల ఢీ షో నుంచి సుధీర్ ని, రష్మీని తొలగించారు. అయితే వీరిద్దరిని తొలగించిన తర్వాత ఢీ షో రేటింగ్స్ అమాంతం పడిపోయాయి. సుధీర్ ఫ్యాన్స్ మాత్రం మళ్లీ ఢీ షోకి రావాలని అడుగుతున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…