సావిత్రి ఈ మూడు అక్షరాల పేరు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక. ఆమె సినీ ప్రవేశ తొలి రోజుల్లో పట్టుపరికిణీతో వెండితెరపై కనిపించి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ మహానటి తెరమరుగైన దశాబ్దకాలం తర్వాత దాదాపుగా అదే రూపంతో సౌమ్య అలియాస్ సౌందర్య వెండితెరపై కనిపించి తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు.
శాండల్ వుడ్ కు సంబంధించిన రచయిత, దర్శకుడు, ప్రొడ్యూసర్ సత్యనారాయణ ‘గంధర్వ’ అనే చిత్రానికి కథ,స్క్రీన్ ప్లే అందించారు. ఆ సినిమా విషయంలో బెంగళూరులో డబ్బింగ్ ధియేటర్ కి వెళ్లారు. ఆ రోజు సెలవు కావడంతో సౌందర్య నాన్న గారితో వెళ్లారు. ‘గంధర్వ’ సినిమాకి మొదటి హీరోయిన్ ఎంపిక అయినప్పటికీ రెండో హీరోయిన్ కోసం వెతుకుతున్న దర్శకుడికి సౌందర్య కనిపించడంతో ఆ సినిమాలో నటించాల్సిందిగా సౌందర్యను కోరడం జరిగింది. ఆమె నాన్నగారు జోక్యం చేసుకొని తన అభిప్రాయం ఏంటో ఇంటికి వెళ్లి ఆలోచించి చెబుతుందన్నారు. అలా ఇంటికి వెళ్లిన సౌందర్యతో ఆమె అమ్మగారు, మావయ్య, అన్నయ్య సినిమాలో నటించమని సలహా ఇచ్చారు. కానీ ఎక్కడా ఆమెను ఒత్తిడి చేయలేదు. బాగా ఆలోచించిన సౌందర్య ఆ సినిమా కోసం పది రోజులు షూటింగ్ చేసుకోడానికి దర్శక,నిర్మాతలకు అవకాశం ఇచ్చారు.
అలా ఆమె అవకాశం ఇవ్వడంతో ‘గంధర్వ’ సినిమా పూర్తి చేశారు. ఆ సినిమాను చూసిన మరో కన్నడ దర్శకుడు తను తీయబోయే చిత్రంలో కూడా సౌందర్యను నటించమని కోరారు. కానీ తన చదువుకు ఇబ్బంది లేకుండా సెలవు రోజుల్లో మాత్రమే షూటింగ్ చేయాలి ఒకవేళ అత్యవసరం అనుకుంటే కాలేజీ అవర్స్ ముందు గానీ ఆ తర్వాత గానీ షూటింగ్ చేసుకోమని సౌందర్య చెప్పారు. ఆ తర్వాత నిర్మాత త్రిపురనేని కన్నడలో విడుదలైన ‘గంధర్వ’ చిత్రాన్ని చూసి తెలుగులో కృష్ణ హీరోగా తీస్తున్న ‘రైతుభారతం’ చిత్రంలో హీరోయిన్ కోసం సౌందర్యను సంప్రదించారు. కన్నడంలో ఇటు తెలుగులో అవకాశాలు రావడంతో.. అప్పటికే ఎమ్.బి.బి.ఎస్ కోర్స్ లో చేరి 9 నెలలే అవుతుంది. అంతటితో చదువుకు స్వస్తి చెప్పి తెలుగులో ‘రైతు భారతం’ చిత్రంలో కృష్ణతో నటిస్తూనే మనవరాలిపెళ్లి, అమ్మోరు చిత్రాలలో నటించడం మొదలు పెట్టారు.
అలా కొన్ని కారణాలతో ‘రైతుభారతం’ చిత్ర షూటింగ్ ఆలస్యం కావడంతో ముందుగా తెలుగులో “మనవరాలి పెళ్లి” చిత్రం విడుదల అయ్యింది. అమ్మోరు,పెదరాయుడు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో సౌందర్యకు మరింత పేరు వచ్చింది. ఆ తర్వాత పవిత్ర బంధం,పెళ్లి చేసుకుందాం, రాజా లాంటి చిత్రాలు ఆమెను ఫ్యామిలీ ఆడియన్స్ కు మరింత దగ్గర చేశాయి. అమితాబ్ బచ్చన్ తో సూర్యవంశ్, రజినీకాంత్ తో నరసింహ, చిరంజీవితో చూడాలని ఉంది లాంటి బ్లాక్ బస్టర్స్ లో నటించడంతో సౌందర్య క్రేజ్ అమాంతం ఆకాశాన్ని అంటుతుంది. 2002 గిరీష్ కాసరవెల్లి దర్శకత్వంలో ‘ద్వీప’ అనే కన్నడ చిత్రంలో సౌందర్య నటించారు. ఈ సినిమాకి రెండు నేషనల్ అవార్డ్స్ తో పాటు నంది, ఫిల్మ్ ఫేర్ అవార్డులు వచ్చాయి.
సౌందర్య అలా తన క్రేజ్ మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతున్న సమయంలో తమ దగ్గర బంధువు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జి.ఎస్. రఘును 2003 ఎప్రిల్ 27న పెళ్లి చేసుకున్నారు. ఓ అనాధ ఆశ్రమాన్ని, “అమర్ సౌందర్య విద్యాలయాన్ని” స్థాపించారు. తన సోదరుడు సహకారంతో ఆమె వీటిని కొనసాగించేవారు. ఈ క్రమంలో పార్టీ ఆహ్వానం మేరకు సౌందర్య బిజెపిలో చేరారు. 2004లో లోక్ సభకు ఎన్నికలువచ్చాయి. బీజేపీ హైకమాండ్ కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రంలోని విద్యాసాగర్రావు పోటీ చేస్తున్న పార్లమెంట్ నియోజవర్గం (కరీంనగర్)కు బెంగళూరు విమానాశ్రయం నుంచి సౌందర్య ఆమె సోదరుడు బయలుదేరారు.
గాల్లోకి ఎగిరిన ఆ చార్టెడ్ విమానం కొన్ని క్షణాల్లోనే సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలెట్ పక్కనే ఉన్న గాంధీ విశ్వవిద్యాలయ మైదానంలో దింపడానికి ప్రయత్నం చేశారు. ల్యాండ్ అయ్యే అతి కొద్ది క్షణాల్లో విమానంలో ఒక్కసారిగా అగ్నిజ్వాలలు చెలరేగాయి. సౌందర్య ఆమె కడుపులో పెరుగుతున్న రెండు నెలల శిశువు, ఆమె సోదరుడు అమర్ నాథ్ సహా ఆ మంటల్లో ఆహుతి కావలసి వచ్చింది. కాలం వేసిన కాటుకు సౌందర్య కుటుంబం ఒక్కసారిగా చిన్నాభిన్నమైంది. అమర్ నాథ్ భార్య.. ఒకప్పుడు సౌందర్య వీలునామా తమకే రాశారని ఆస్తి విషయంలో కోర్టుకు వెళ్లారు. ఆమెకు ప్రతి సవాలు చేస్తూ సౌందర్య తల్లి మరియు సౌందర్య భర్త జి.ఎస్. రఘు కూడా కోర్టును ఆశ్రయించారు. చివరికి 2013 లో ఉభయుల మధ్య సయోధ్య కుదిరి ఒక అంగీకారంతో ఆస్తులను పంచుకున్నారు. ‘నవరస నటనా మయూరి’ సౌందర్య మరణించిన ఇంకా తెలుగు ప్రేక్షకుల మనసులో ఆమె జ్ఞాపకాలు కదులుతూనే ఉన్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…