Acharya-Chiranjeevi: వివాదంలో ఆచార్య స్పెషల్ సాంగ్..పోలీసులకు ఫిర్యాదు చేసిన యువకుడు..!

Acharya-Chiranjeevi: మెగస్టార్ చిరంజీవి.. తన రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. మళ్లీ ఫుల్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేశాడు. ఎంతలా అంటే.. ఏమాత్రం గ్యాప్ లేకుండా..రెస్ట్ లేకుండా.. వరుస సినిమాలకు సైన్ లు చేసేస్తున్నారు. ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న సినిమా ఆచార్య.

ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మేకర్స్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉండగా.. అనూహ్యంగా ఓ ఘటన చోటు చేసుకుంది. వాళ్లు ప్రస్తుతం న్యాయపరమైన ఇబ్బందులతో చిక్కుకున్నారు. గీత రచయిత భాస్కరభట్ల, దర్శకుడు కొరటాల శివపై జనగామకు చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు ఫిర్యాదు చేశారు.

ఎందుకంటే.. ఇటీవల ఆచార్య సినిమాలోని ఓ ఐటెం సాంగ్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిలో చిరంజీవి సరనన ఆడిపాడిన మద్దుగుమ్మ రెజీనా. ఈ సాంగ్ పెద్ద వివాదాన్ని తెచ్చిపెట్టింది.
ఆ పాటలో ఆర్ఎంపీ వైద్య సంఘాన్ని కించపరిచేవిధంగా పదాలు ఉన్నాయని.. వాటిని చెడుగా చూపించే ప్రయత్నం చేశారని అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కావాలనే మనోభావాలను దెబ్బతీస్తున్నారు..

ఇందులో… “యాదేదో నీమరొచ్చనీ కుర్రాళ్లే RMP లు అవుతున్నారే” అనే సాహిత్యం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ లైన్ వివాదానికి దారి తీసింది. ఈ లైన్‌లను తప్పుగా పేర్కొని.. వాటిని కావాలనే ఇలా చూపించారని ఆరోపిస్తున్నారు. ఆర్ఎంపీల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ లిరిక్స్ ఉన్నాయని.. రాష్ట్ర ఆర్‌ఎంపీల సంఘం నాయకులు ఆరోపించారు. ఆచార్య చిత్ర నిర్మాతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మరి దీనిపై ఆచార్య మూవీ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఏమైనా వివిరణ ఇస్తారా.. లేదా.. పాటలో ఏమైనా మార్పులు చేస్తారో చూడాలి. ఆచార్యకి మణి శర్మ సంగీతం అందించగా.. సానా కష్టం పాటను రేవంత్ , గీతా మాధురి ఆలపించారు. చిరంజీవి, రామ్ చరణ్‌లను తొలిసారిగా పూర్తి స్థాయి పాత్రలో నటిస్తున్నారు.