Acharya-Chiranjeevi: మెగస్టార్ చిరంజీవి.. తన రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. మళ్లీ ఫుల్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేశాడు. ఎంతలా అంటే.. ఏమాత్రం గ్యాప్ లేకుండా..రెస్ట్ లేకుండా.. వరుస సినిమాలకు సైన్ లు చేసేస్తున్నారు. ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న సినిమా ఆచార్య.
ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మేకర్స్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉండగా.. అనూహ్యంగా ఓ ఘటన చోటు చేసుకుంది. వాళ్లు ప్రస్తుతం న్యాయపరమైన ఇబ్బందులతో చిక్కుకున్నారు. గీత రచయిత భాస్కరభట్ల, దర్శకుడు కొరటాల శివపై జనగామకు చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు ఫిర్యాదు చేశారు.
ఎందుకంటే.. ఇటీవల ఆచార్య సినిమాలోని ఓ ఐటెం సాంగ్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిలో చిరంజీవి సరనన ఆడిపాడిన మద్దుగుమ్మ రెజీనా. ఈ సాంగ్ పెద్ద వివాదాన్ని తెచ్చిపెట్టింది.
ఆ పాటలో ఆర్ఎంపీ వైద్య సంఘాన్ని కించపరిచేవిధంగా పదాలు ఉన్నాయని.. వాటిని చెడుగా చూపించే ప్రయత్నం చేశారని అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇందులో… “యాదేదో నీమరొచ్చనీ కుర్రాళ్లే RMP లు అవుతున్నారే” అనే సాహిత్యం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ లైన్ వివాదానికి దారి తీసింది. ఈ లైన్‌లను తప్పుగా పేర్కొని.. వాటిని కావాలనే ఇలా చూపించారని ఆరోపిస్తున్నారు. ఆర్ఎంపీల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ లిరిక్స్ ఉన్నాయని.. రాష్ట్ర ఆర్‌ఎంపీల సంఘం నాయకులు ఆరోపించారు. ఆచార్య చిత్ర నిర్మాతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరి దీనిపై ఆచార్య మూవీ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఏమైనా వివిరణ ఇస్తారా.. లేదా.. పాటలో ఏమైనా మార్పులు చేస్తారో చూడాలి. ఆచార్యకి మణి శర్మ సంగీతం అందించగా.. సానా కష్టం పాటను రేవంత్ , గీతా మాధురి ఆలపించారు. చిరంజీవి, రామ్ చరణ్‌లను తొలిసారిగా పూర్తి స్థాయి పాత్రలో నటిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…