Categories: FeaturedMovie News

Srihan: బిగ్ బాస్ సీజన్ 6లో సిరి ప్రియుడు శ్రీహాన్.. హింట్ ఇదే..!

Srihan: బిగ్ బాస్ 5 సీజన్ ముగిసినా ఇప్పటికీ ఏదో విషయంలో ట్రెండింగ్ లోనే ఉంటోంది. దీంతో బిగ్ బాస్ 6 గురించి అందరూ ఆలోచిస్తున్నారు. ఈ సారి ఎవరెవరు కంటెస్టెంట్స్ ఉంటారో అని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ 5 సీజన్ చాలా ఫేమస్ అయింది.

ఇందుకు ఇంతలా ఫేమస్ కావడానికి కారణం రెండు జంటలు విడిపోవడం అనే వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ హౌజ్ లో సిరి, షన్నూ చాలా క్లోజ్ గా మూవ్ కావడంతో ఇటు షన్నూ- దీప్తి సునయన, శ్రీహాన్- సిరి జంటల మధ్య విభేదాలు తలెత్తాయి.  ఇప్పటికే షణ్ముఖ్ జశ్వంత్, దీప్తి సునయలు బ్రేకప్ చెప్పుకున్నారు. ఇటీవల ఇన్ స్టా వేదికగా దీప్తి సునయన, షన్నూతో విడిపోతున్నట్లు ప్రకటించింది.

ఇదిలా ఉంటే.. సిరి, శ్రీహాన్ మధ్య కూడా గ్యాప్ ఏర్పడిందని తెలుస్తోంది. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత.. వీరిద్దరూ ఇప్పటి వరకు కలవకపోవడం చూస్తే వీళ్లు కూడా రేపో మాపో బ్రేకప్ చెప్పుకోవచ్చని తెలుస్తోంది. ఈ వివాదాల మధ్య బిగ్ బాస్ నెక్ట్ సీజన్ కంటెస్టెంట్ల వేట కూడా సాగుతోందని తెలుస్తోంది.

బిగ్ బాస్ సీజన్ 6లో శ్రీహాన్..


ఇదిలా ఉంటే 24/7 ఓటీటీ బిగ్ బాస్ కూడా సిద్దం అవుతోంది. హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుందని ఇప్పటికే నాగార్జున ప్రకటించాడు. అయితే ఈసారి శ్రీహాన్ బిగ్ బాస్ నెక్ట్స్ సీజన్ లో తప్పకుండా ఉంటాడనే చర్చ జరుగుతోంది. సిరి, షన్నూల వ్యవహారంతో సిరి చాలా నెగిటివిటీని మూటగట్టుకుంది. మరోవైపు శ్రీహాన్ సింపతితో పాజిటివిటీ సంపాదించుకున్నాడు. ఇటీవల స్టార్ మాలో స్టార్ మ్యూజిక్ షోలో ప్రోమోలో కనిపించాడు. గతంలో స్టార్ మాలో షోల్లో కనిపించిన వ్యక్తులు బిగ్ బాస్ కంటెస్టెంట్లుగా వచ్చారు. అనవాయితీ కొనసాగితే శ్రీహాన్ కూడా నెక్ట్స్ సీజన్ లో బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

2 months ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

4 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

4 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago