Junior NTR: ఇండియా మొత్తం చాలా ఇంట్రెస్ట్ గా చూస్తున్న సినిమా ట్రిపుల్ ఆర్. అయితే జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేద్దాం అనుకన్నప్పటికీ.. కరోనా కారణంగా మరోసారి వాయిదా పడింది. ఇదిలా ఉంటే సినిమా ప్రమోషన్లను మాత్రం భారీ ఎత్తున చేశారు. టాలీవుడ్, కోలీవుడ్ లతో పాటు బాలీవుడ్ లోనూ ట్రిపుల్ ఆర్ ప్రమోషన్లను పెద్ద ఎత్తున చేసింది.
పిరియాడిక్ డ్రామాగా వస్తున్న ఈసినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించగా…రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురంభీంగా నటిస్తున్నారు. ఆలియాభట్, ఒలివియా మోరిస్ కథానాయికలు. శ్రియ, అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు.
ఇదిలా ఉంటే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ను బాలీవుడ్ నటి సాహెబా బాలీ ఇంటర్వ్యూ చేశారు. దీనికోసం హైదరాబాద్ వచ్చిన నటి సాహెబా బాలీకి హైదరాబాద్ బిర్యానీతో పాటు తెలంగాణ చేపల పులుసు, గుంటూరు చికెన్‌ను వడ్డించారు. వాటి ప్రాముఖ్యతను తెలియజేశారు. మీరు నిజమైనా పులితో ఫైట్ చేశారా..అని సాహెబా ప్రశ్నించగా..‘ఏమో.. అయిండొచ్చు, కాకపోవచ్చు’ అంటూ తారక్ సమాధానం ఇచ్చారు. మీకు ఎన్ని భాషలు వచ్చు అని అడగ్గా.. ఎన్టీఆర్ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషలు వచ్చు అని సమాధానం ఇచ్చాడు.
అయితే ఈ ఇంటర్వ్యూలో తారక్ ట్రిపుల్ ఆర్ టీంకు పలు రకాల వంటలని సెలెక్ట్ చేశారు. రాజమౌళిని బిర్యానీతో పోల్చారు. బిర్యానీ చూడటాని సింపుల్ గా ఉంటుంది కానీ దీన్ని తయారు చేయాలంటే కష్టపడాలని అన్నారు. రాజమౌళి కూడా అంతే.. చూడటానికి సింపుల్ గా ఉంటాడు కానీ.. పని విషయంలో ఫర్ఫక్ట్ గా ఉంటాడని చెప్పాడు. పానిపూరీ నోట్లో వేసుకోగానే.. దాని ఫ్లేవర్లు బయటపడుతాయని.. చరణ్ కూడా ఇంతే అని.. తనతో మాటలు కలిపితే అన్ని విషయాలు పంచుకుంటాడని చెప్పాడు. అలియా భట్ ఇరానీ బన్ మస్కా వంటిదని ఎంతో ఆరోగ్యవంతమైనదని.. అలియా కూడా చాలా ప్రత్యేకమైనదని అన్నాడు. అజయ్ దేవ్ గన్ కు వడాపావ్ సెలెక్ట్ చేశాడు. ముంబై లోెకల్ ఫుడ్. అక్కడి వారికి ఇది ఖచ్చితంగా కావాల్సిందే అని.. అలాగే అజయ్ దేవ్ గన్ అందరికి కావాల్సిన వాడే అని అన్నారు.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…