Jhulan Goswami-Anushka Sharma: బయోపిక్ లు అనేవి సినీ పరిశ్రమలో కామన్ అయిపోయాయి. ఇటీవల ఎంఎస్ ధోనీ బయోపిక్ కూడా సినిమాలో వచ్చిన విషయం తెలిసిందే. తర్వాత సినీ పరిశ్రమలో సీనియర్ హీరోల బయోపిక్ లు కూడా ఇటీవల సినిమాల రూపంలో వచ్చేస్తున్నాయి.
ఇటీవలే ‘రశ్మీ రాకెట్’ మూవీలో అథ్లెట్ గా నటించి, సినీ అభిమానుల మెప్పు పొందిన తాప్సీ పన్ను తాజాగా మిథాలీ రాజ్ బయో పిక్ షూటింగ్ పూర్తి చేసింది. భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ బయోపిక్ ను ‘శభాష్ మిథు’ పేరుతో శ్రీజిత్ ముఖర్జీ తెరకెక్కించాడు.
తాజాగా అనుష్క శర్మ మరోసారి ఓ బయోపిక్ లో కనిపించనుంది. 2018లో ‘జీరో’లో చివరిగా కనిపించిన ఈ బ్యూటీ తన తదుపరి చిత్రం “చక్దా ఎక్స్‌ప్రెస్”లో నటించబోతోంది. భారత మాజీ కెప్టెన్ జులన్ గోస్వామి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో అనుష్క టైటిల్ రోల్ పోషిస్తోంది .
ఇక ఈసినిమా పేరును చక్దా ఎక్స్‌ప్రెస్ టైటిల్ ను ఫైనల్ చేశారు. ఈమేరకు ఆమె టీజర్ ను తన ట్విట్టర్ ఖాతా లో పోస్టు చేసింది. ఈ సినిమాలో జులన్ జీవితాన్ని.. ఆమె క్రికెట్ లో రావడానికి పడ్డ కష్టాలను వివరించనున్నారు. క్రికెటర్ అంటే కేవలం పురుషులు మాత్రమే కాదు.. మహిళలు కూడా ఆడి చూపించగలరని.. వాళ్లకు కూడా ఈ రంగంలో కెరీర్ ఉంటుందని చెప్పే కథ ఇది. ఆమె వల్ల తరువాతి తరం అమ్మాయిలకు క్రికెట్ లో మెరుగైన కెరీర్ ఏర్పడింది అంటూ అనుష్క పోస్ట్ చేసింది. ఇక విరుష్క దంపతులు ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆమె పేరు వామిక. అనుష్క శర్మ తన కుమార్తె వామిక పుట్టిన తర్వాత చేస్తున్న మొదటి ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. అయితే ఇది ఎప్పుడు విడుదల చేస్తారో తెలియదు కానీ.. నెట్ ఫ్లిక్స్ లో మాత్రం స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…